AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదలకు సూపర్ గుడ్‌న్యూస్.. అసైన్డ్‌ స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్.. ఇక ఆ ఇల్లు మీ సొంతమే!

AP Assigned Lands Registration: రాష్ట్రంలోని ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. అసైన్డ్ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ స్థలాల్లో పదేళ్లకుపై నివాసం ఉంటున్న వారి పేరు మీదే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసిది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది.

పేదలకు సూపర్ గుడ్‌న్యూస్.. అసైన్డ్‌ స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్.. ఇక ఆ ఇల్లు మీ సొంతమే!
Ap Assigned Lands Registration
Anand T
|

Updated on: May 22, 2026 | 8:39 AM

Share

రాష్ట్రంలోని అసైన్డ్‌ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకున్న పేదలకు కూటమి ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. పదేళ్ల గడువు తీరిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి అధికారలుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఇంటి స్థలాలను అసైన్ చేస్తూ లబద్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, ఇంటి పట్టాతో పాటు గత పదేళ్లుగా చెల్లించిన ఇంటి పన్ను రశీదులు ఉన్న ప్రతి ఒక్కరికి అసైన్డ్‌ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అధికారులకు తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తైన 90 రోజుల తర్వాత ఈ ఇంటిపై క్రయ, విక్రయాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. అంటే లబ్ధిదారులపై పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన 90 రోజుల తర్వాత ఇంటిపై వారికి పూర్తి హక్కులు లభిస్తాయి. అప్పుడు మీరు ఇంటిని అమ్మకోవాలనుకున్న మీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంతేకాదు మీరు ఈ ఇంటి పత్రాలను బ్యాంక్‌లో లాకట్టు పెట్టి లోన్స్ కూడా పొందచ్చు.

అసైన్డ్ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇవి తప్పని సరి

  • గతంలో ప్రభుత్వం స్థలాన్ని అసైన్డ్‌ చేస్తూ ఇచ్చిన పట్టా, గడిచిన పదేళ్లుగా మీరు కట్టించిన ఇంటి పన్ను రశీదులు ఉండాలి.
  • ప్రభుత్వం స్థలం అసైన్డ్‌ చేసి 10 ఏళ్లు పూర్తైన వారు మాత్రమే దీని అర్హులు
  • అలాగే ఇంటి పట్టా లబ్ధిదారుడి పేరిటే ఉండాలి, ఒక వేళ ఆయన మరణిస్తే.. వారసులు మరణదృవ పత్రం సమర్పించాల్సి ఉంటుంది
  • ఒక వేళ మీరు ఇచ్చిన స్థలం నిషేదిక జాబితాలో ఉండి.. అందులో మీరు ఇల్లు నిర్మించుకున్నా.. పదేళ్లు పూర్తైతే రిజిస్ట్రేషన్ చేస్తారు.
  • రిజిస్ట్రేషన్‌ పూర్తైన 90రోజుల తర్వాత ఇంటిపై మీకు పూర్తి హక్కు లభిస్తుంది. అప్పుడు మీరు కావాలనుకుంటే ఇంటిని అమ్ముకోవచ్చు
  • రిజిస్ట్రేషన్‌ కోసం ఫేక్‌పట్టాలు, నకిలీ ఉత్తర్వులు సమర్పిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us