AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

47 నాటౌట్.. తెలుగురాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. ఆ టైంలో బయటకొస్తే..

గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నారు. ఉదయం 8 అయిందంటే చాలూ భానుడి భగభగలతో జనాలు ఉక్కరికిబిక్కిరి అవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎండల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

47 నాటౌట్.. తెలుగురాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. ఆ టైంలో బయటకొస్తే..
Telugu States Heatwave
Anand T
|

Updated on: May 22, 2026 | 7:13 AM

Share

తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 అయితే చాలూ భానుడు అగ్నిగోళంగా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు అడుగుబయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 43 నుంచి 47 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా భద్రాచలంలో దాదాపు 47 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాబోయే ఒకటి రెండ్రోజు పాటు పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక భారీ ఉష్ణోగ్రతల నేపథయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తోపాటు నల్గొండ ఖమ్మం జిల్లాలో రెడ్ అల్లర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే రాష్ట్రంలో మరి కోన్ని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక్కరోజులోనే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు తెలిపింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ తరహా వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 44 నుండి 47 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉదయం అంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలకు పలు జిల్లాల్లో రాత్రి కురిసిన వర్షం ఉపశమనం కలిగింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఓఆర్ఎస్, లవణాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిదని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us