AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: ఆ సినిమా జెస్ట్ యావరేజ్.. కానీ అందరూ 100కోట్ల మూవీ అనుకుంటున్నారు..

హీరో నాని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసిస్టెండ్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి… ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే హీరోగా ప్రశంసలు అందుకున్న నాని.. తర్వాత విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Nani: ఆ సినిమా జెస్ట్ యావరేజ్.. కానీ అందరూ 100కోట్ల మూవీ అనుకుంటున్నారు..
Nani
Rajeev Rayala
|

Updated on: May 22, 2026 | 7:15 AM

Share

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం నాని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విభిన్నమైన కంటెంట్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు నాని. గతంలో ఎక్కువగా లవ్ స్టోరీల మీద ఫోకస్ చేసిన నాని రూట్ మార్చి యాక్షన్ సినిమా వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. బ్యాక్తు బ్యాక్ దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో మెప్పించిన నాని ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

ఇక ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇక నాని సినిమాలు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాని సినిమా వస్తుందంటే పక్కా ఎంటర్టైన్ అవ్వొచ్చు అని ఆడియన్స్ ఫిక్స్ అవుతుంటారు. హాయిగా ఫ్యామిలీతోపాటు వెళ్లి నాని సినిమాలు చూడొచ్చు.. అయితే నాని నటించిన సినిమాల్లో ఓ మూవీ ముందుగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కట్ చేస్తే రన్నింగ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఎదో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఆ సినిమా మరేదో కాదు నానికి క్రేజే హిట్ ఇచ్చిన పిల్ల జమిందార్. నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిల్లజమీందారు విడుదలైనప్పుడు జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది.. కానీ రన్నింగ్ లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ సినిమా ఇది. పిల్లజమీందారు సినిమా యావరేజ్ కానీ ఇప్పటికీ చాలా మంది ఆ సినిమా 100కోట్లు వసూల్ చేసిన సినిమా అనుకుంటారు.. చాలా మంది ఆ సినిమా భారీ హిట్ అని అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు నాని.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us