ఎండ ప్రచండం.. సూర్యారావు వీరబాదుడు.. ఈసారి హాఫ్ సెంచరీ పక్కా..
భారతదేశంలో ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 48°C దాటి 50°C చేరుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర వడగాల్పులతో అల్లాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో, పట్టణీకరణ, అడవుల నరికివేత వంటివి దీనికి ప్రధాన కారణాలుగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ వేడి.. రుతుపవనాలు వచ్చేవరకు కొనసాగే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని బాందా నగరం. ఇప్పుడు వరల్డ్ హాటెస్ట్ సిటీ ఇదే.. భూమ్మీద అత్యధికంగా ఎండవేడికి తల్లడిల్లే నగరం. ఔను, ఈ ఏడాది వేసవి సీజన్‌లో యూపీకి దక్కిన గొప్ప క్రెడిట్ ఇది. గత నెలలో నాలుగైదు సార్లు హయ్యస్ట్ టెంపరేచర్లు రికార్డయ్యి గ్లోబల్ మీడియాలో హోరెత్తిపోతోంది బాందా సిటీ. టార్చర్ ఆఫ్ 48 డిగ్రీస్ ఎలా ఉంటుందో అచ్చంగా ఫేస్ చేస్తోంది టోటల్ యూపీ. కానీ, అంతకుమించిన టెంపరేచర్లతో యూపీ రికార్డును బ్రేక్ చేసింది ఏపీ. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిపోయింది. తెలుగురాష్ట్రాల్నే కాదు, దేశం మొత్తాన్నీ కనికరం లేకుండా కుళ్లబొడుస్తున్నాడు రాక్షసావతారమెత్తిన భానుడు. ఈ ప్రతాపానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? వెదర్ బిహేవియర్‌లో ఒక్కసారిగా ఇంతటి విపరీతమైన మార్పు ఎందుకొస్తున్నట్టు? దేశమంతా నిప్పుల కొలిమిలా మారి, భగభగ మండిపోతోంది. నడినెత్తినెక్కి కరాళనాట్యం ఆడేస్తున్నాడు ఉగ్రరూపమెత్తిన భానుడు. ఇదిగో ఈ ఎర్రబారిన ఇండియా మ్యాప్ చూడండి.. మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిన ఈ ఫోటో ఒక్కటి చాలు.. దేశంలో ఎండప్రచండం ఏ రేంజ్‌లో ఉందో తెలీడానికి. 90 శాతానికి పైగా దేశ భూభాగాన్ని పూర్తిగా రౌండప్ చేసింది మండుటెండ. అరేబియన్ సముద్ర శీతల గాలులతో కేరళం, కొన్ని హిల్ స్టేషన్లు, నార్త్ ఎండ్‌లోని కాశ్మీర్, అక్కడున్న కొండ ప్రాంతాల్లో మాత్రమే కొద్దొగొప్పో గ్రీన్ ఫిల్లింగ్ కనిపిస్తోంది. పాతిక డిగ్రీలకు అటూఇటూ టెంపరేచర్లు నమోదై.. సమ్మర్ స్ట్రోక్ నుంచి దూరంగా...
