AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Polycet 2026 Results: రేపే తెలంగాణ పాలీసెట్‌ 2026 ఫలితాలు.. కౌన్సెలింగ్‌ ఎప్పట్నుంచో తెలుసా?

రాష్ట్ర పాలీసెట్‌ ఫలితాలు రేపు (శనివారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు మే 23లోపు రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించగా మరుసటి రోజే అంటే మే 14న ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేశారు. మే 16వ తేదీ వరకు ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను..

TG Polycet 2026 Results: రేపే తెలంగాణ పాలీసెట్‌ 2026 ఫలితాలు.. కౌన్సెలింగ్‌ ఎప్పట్నుంచో తెలుసా?
TG Polycet results
Srilakshmi C
|

Updated on: May 22, 2026 | 6:30 AM

Share

హైదరాబాద్‌, మే 22: తెలంగాణ పాలీసెట్‌ ఫలితాలు రేపు (శనివారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు మే 23లోపు రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించగా మరుసటి రోజే అంటే మే 14న ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల చేశారు. మే 16వ తేదీ వరకు ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్‌ కీ తయారు చేసిన సాంకేతిక విద్యాశాఖ ఈ మేరకు మే 23న పాలీసెట్‌ ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇక మే 27 నుంచి పాలీసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ మే 18న నిర్వహించిన సమావేశంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ జరగపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలి విడత కౌన్సెలింగ్‌ సీట్లను జూన్‌ 6న కేటాయిస్తారు.

మొదటి విడత కౌన్సెలింగ్‌:

  • మే 27 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్
  • మే 29 నుంచి జూన్‌ 1 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • మే 29 నుంచి జూన్‌ 3 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
  • జూన్‌ 6న సీట్ల కేటాయింపు
  • జూన్‌ 6 నుంచి 9 వరకు ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్
  • జూన్‌ 8, 9 తేదీల్లో సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్
  • జూన్‌ 9 నుంచి తరగతులు ప్రారంభం

చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

  • జూన్‌ 15 నుంచి 22వ తేదీ వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది
  • జూన్‌ 27 నుంచి 30 వరకు ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఉంటుంది. ఈ తేదీల్లో అప్పటికే సీటు పొందిన కాలేజీల్లో బ్రాంచి మార్చుకోవచ్చు
  • జులై 1 నుంచి 8 తేదీల మధ్య స్పాట్‌ ప్రవేశాలు
  • జూన్‌ 9న పాలిటెక్నిక్‌ విద్యా సంవత్సరం ప్రారంభం

Follow Us
ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి..
ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి..
టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?
టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి...
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి...
పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు..ఈ రాశులవారికి తిరుగులేని సక్సెస్
పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు..ఈ రాశులవారికి తిరుగులేని సక్సెస్
టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. షాకింగ్ రిపోర్ట్!
టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. షాకింగ్ రిపోర్ట్!
మందేసి.. RTC బస్సు కనిపించగానే డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కాడు.. ఆపై
మందేసి.. RTC బస్సు కనిపించగానే డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కాడు.. ఆపై
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ..
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ..
ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు
ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు
యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ
యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ
తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు..
తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు..