AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ సంస్కృతికి ప్రపంచ నీరాజనం.. అంతర్జాతీయ కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ చారిత్రక అరంగేట్రం!

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళా వైభవం ఉట్టిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు రత్నాలలా మెరిశాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా చేనేత కార్మికుల అద్భుత సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది.

భారతీయ సంస్కృతికి ప్రపంచ నీరాజనం.. అంతర్జాతీయ కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ చారిత్రక అరంగేట్రం!
Pochampally Ikkat Saree Exhibited By Rashmi Thakur
M Revan Reddy
| Edited By: |

Updated on: May 22, 2026 | 9:17 AM

Share

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళా వైభవం ఉట్టిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు రత్నాలలా మెరిశాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా చేనేత కార్మికుల అద్భుత సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది. ఈ చారిత్రాత్మక వేడుకలో భారతదేశ సాంస్కృతిక బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ డిజైన్ల వస్త్రాలు ధరించి రెడ్ కార్పెట్ పై వాక్ చేసి అందరినీ అబ్బురపరిచారు.

ప్రపంచవ్యాప్తంగా ‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంత చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రష్మీ ఠాగూ‌ర్‌ను తెలంగాణ చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ (కేన్స్) నగరంలో జరిగిన 79వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2026లో మన ఇక్కత్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ కూచర్ దుస్తులను రష్మీ ఠాకూర్ ఈ వేదికపై ధరించారు.

‘పోచంపల్లి టు కేన్స్’ అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ప్రదర్శన రూపొందింది. తెలంగాణ మగ్గాల నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవం వరకు మన భౌగోళిక గుర్తింపు (GI Tag) కలిగిన చేనేతను తీసుకెళ్లడం ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. రష్మీ ఠాగూర్ ధరించిన ఇక్కత్ వస్త్రాలకు ప్రఖ్యాత హైదరాబాదీ ముత్యాలు – నిజాంల కాలం నాటి వారసత్వ ఆభరణాలు తోడవ్వడం ఈ ప్రదర్శనకు అదనపు హంగులను తెచ్చింది. ఇక్కత్ నేతలోని రేఖాగణిత (Geometric) డిజైన్‌లకు సరిపోయేలా ఈ ముత్యాల ఆభరణాలను అలంకరించారు. భారత దేశ వస్త్ర వారసత్వానికి, రాజసపు ఆభరణాల వైభవానికి మధ్య జరిగిన ఈ కలయిక అంతర్జాతీయ వేదికపై ఒక శక్తివంతమైన సంభాషణను సృష్టించింది.

కేన్స్ రెడ్ కార్పెట్ పై ఇక్కత్ వస్త్రాలతో వాక్ చేయడంపై రష్మీ ఠాగూర్ సంతోషం, గర్వం వ్యక్తం చేశారు. “ఇది కేవలం నా వ్యక్తిగత ఆరంగేట్రం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళకు జరిగిన అరంగేట్రం. 200 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను, శ్రమను తమ దారాల్లో పొదిగిన పోచంపల్లి నేతన్నల కళావైభవానికి ఇది నిదర్శనం. మన చేనేతను హైదరాబాద్ ముత్యాలతో జత చేయడం భారతదేశ హస్తకళకు నిజమైన గౌరవం” అని ఆమె పేర్కొన్నారు.

రష్మీ ఠాకూర్ ఇచ్చిన ఈ రాయల్ ప్రదర్శనతో అంతర్జాతీయంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు బహుళ ప్రాచుర్యం లభించింది. గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో మన చేనేత కళ సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి ఇది ఒక చక్కని బాటలు వేసింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెదరాయుడు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా.. ? ఇప్పుడు..
పెదరాయుడు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా.. ? ఇప్పుడు..
శుక్రుడు సంచారం.. వీరికి గోల్డెన్ పీరియడ్.. పెండింగ్ డబ్బు చేతికి
శుక్రుడు సంచారం.. వీరికి గోల్డెన్ పీరియడ్.. పెండింగ్ డబ్బు చేతికి
ఆడి కారులో వచ్చి చెప్పులు కుట్టే వ్యక్తి..లగ్జరీ లైఫ్ చూస్తే షాక్
ఆడి కారులో వచ్చి చెప్పులు కుట్టే వ్యక్తి..లగ్జరీ లైఫ్ చూస్తే షాక్
అట్టర్ ఫ్లాప్ మ్యాచ్‌లోనూ చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
అట్టర్ ఫ్లాప్ మ్యాచ్‌లోనూ చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
ఈ దేశంలో చూయింగ్ గమ్ నమిలితే జైలుకే.. దాని వెనుకున్న కథ..
ఈ దేశంలో చూయింగ్ గమ్ నమిలితే జైలుకే.. దాని వెనుకున్న కథ..
ఏంట్రా బాబు ఈ సినిమా ఇలా ఉంది.. చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే
ఏంట్రా బాబు ఈ సినిమా ఇలా ఉంది.. చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే
ఇక నుంచి టికెట్‌ను స్క్రీన్‌షాట్‌, వాట్సాప్‌లో చూపించలేరు!
ఇక నుంచి టికెట్‌ను స్క్రీన్‌షాట్‌, వాట్సాప్‌లో చూపించలేరు!
60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే..
60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే..
ప్రెషర్‌ కుక్కర్‌ట్రిక్‌తో దూదిలాంటి సాఫ్ట్‌ ఇడ్లీ..ఇన్‌స్టంట్‌గా
ప్రెషర్‌ కుక్కర్‌ట్రిక్‌తో దూదిలాంటి సాఫ్ట్‌ ఇడ్లీ..ఇన్‌స్టంట్‌గా
కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!
కోహ్లీ, రోహిత్ లెగసీకి బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్..!