Aadhaar Card : ఆధార్ కార్డుతో ఆన్‌లైన్ మోసాలు..! వినియోగదారులను హెచ్చరిస్తున్న UIDAI
Aadhaar Card : ఆన్‌లైన్ మోసాలు నిరంతరం పెరుగుతున్నాయి. కనుక ఏ విషయంలోనైనా అప్రమత్తంగా ఉండటం అవసరం. కొత్తగా
Aadhaar Card : ఆన్‌లైన్ మోసాలు నిరంతరం పెరుగుతున్నాయి. కనుక ఏ విషయంలోనైనా అప్రమత్తంగా ఉండటం అవసరం. కొత్తగా సైబర్ కేటుగాళ్లు ఆధార్ కార్డుపై పడ్డారు. OTP, నకిలీ లింకుల ద్వారా మాత్రమే కాకుండా ఆధార్ కార్డును కూడా తమ అస్త్రంగా చేసుకొని మోసాలకు తెగబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి సంబంధించిన సమాచారం మొత్తం ఆధార్ కార్డులో ఉండటమే. ఆధార్‌ని బ్యాంకు ఖాతా నుంచి మొదలు దాదాపు అన్ని పనులకు లింక్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇలాంటి మోసాలను ఎలా నివారించాలో ప్రజలకు తెలియజేస్తూ UIDAI ఇటీవల ఒక ట్వీట్ చేసింది. ఆధార్ కార్డు 12 అంకెల సంఖ్యతో వస్తుంది దీనిని అధికారిక UIDAI వెబ్‌సైట్ నుంచి ధృవీకరించాలి. ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఇది కాకుండా ఆధార్‌ను రుజువుగా ఉపయోగించుకునే ముందు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. ఇది ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి.
మీ ఆధార్ కార్డును ఎలా ధ్రువీకరించాలి.. మీరు మీ ఆధార్ కార్డును ధ్రువీకరించాలనుకుంటే ఆఫ్‌లైన్‌లో ధ్రువీకరించడానికి ఆధార్ కార్డులో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. మరోవైపు ఆన్‌లైన్ ధ్రువీకరణ చేయడానికి, మీరు ఈ లింక్ రెసిడెంట్.యుయిడై.గోవ్.ఇన్ / వెరిఫైని స్వీకరించడం ద్వారా మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తరువాత మీ కార్డు ధ్రువీకరించబడుతుంది. ఇది కాకుండా మీరు mAadhaar యాప్ ద్వారా కూడా ధ్రువీకరించవచ్చు.
ఆధార్ కార్డు మోసం నుంచి ఎలా బయటపడాలి.. 1. మీరు మీ ఆధార్ కార్డును పబ్లిక్ కంప్యూటర్ నుంచి డౌన్‌లోడ్ చేస్తుంటే పని పూర్తయిన వెంటనే దాన్ని తొలగించాలి 2. మీ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు. 3. మీ మొబైల్ నంబర్‌ను మరొకరి ఆధార్‌తో లింక్ చేయడానికి అనుమతించవద్దు. 4. ఆధార్ కార్డు వర్చువల్ ఐడిని ఎల్లప్పుడూ ఉపయోగించండి. ఇందులో 16 అంకెల ఆధార్ కార్డు అందుబాటులో ఉంటుంది. దీనిని ఆధార్ కార్డు స్థానంలో ఉపయోగించవచ్చు. 5. UIDAI పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన, రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌తో అన్‌లాక్ చేయగల మీ బయోమెట్రిక్‌ను ఎల్లప్పుడూ లాక్ చేయండి.
ఆధార్ ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలి మీరు మీ ఆధార్ కార్డును లాక్ చేయాలనుకుంటే మొదట మీ ఫోన్‌లో GETOTP అని టైప్ చేసి 1947 కు SMS పంపండి. ఇలా చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. దీనిని స్వీకరించిన తరువాత మీరు LOCKUID, ఆధార్ నంబర్‌ను టైప్ చేసి 1947 కు మళ్ళీ SMS పంపాలి. ఇలా చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు లాక్ అవుతుంది.