- Telugu News Photo Gallery Technology photos Whatsapp bring new feature for ios users can see full messages in notification only
WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇకపై నోటిఫకేషన్‌లో మొత్తం మెసేజ్ చూసేయొచ్చు.
WhatsApp New Feature: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఐఓస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌తో ప్రయోజనం ఏంటనేగా..
Updated on: Jul 12, 2021 | 8:36 AM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొస్తుంది కాబట్టే దీనికి అంత డిమాండ్.

ఇటీవల వరుసగా కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది కేవల ఐఓస్ యూజర్లకు మాత్రమే.

సాధారణంగా వాట్సాప్‌లో మనకు ఏదైనా మెసేజ్ వస్తే నోటిఫికేషన్‌లో కొంత మేర మాత్రమే చూపిస్తుంది. మెసేజ్ ఏంటో తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేయాల్సిందే.

అలా కాకుండా నోటిఫికేషన్‌లోనే పూర్తి మెసేజ్‌ను చూసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ.! ఇలాంటి ఆలోచన నుంచి ఈ కొత్త ఫీచర్ వచ్చింది.

ఇకపై ఐఓస్ యూజర్లు తమ వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లను నోటిఫికేషన్‌లోనే చదివేయొచ్చు. కొత్తగా తీసుకొచ్చిన 2.21.140.9 బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

అంతేకాకుండా అవతలి వ్యక్తికి మీరు మెసేజ్ చదివినట్లు బ్లూటిక్స్ కూడా చూపించవు. మెసేజ్‌లే కాకుండా ఫొటోలను కూడా ఇలా చూసుకోవచ్చు.





























