Huawei Band 6: భారత మార్కెట్లోకి హువావే కొత్త ఎలక్ట్రిక్‌ బ్యాండ్‌.. మహిళలకోసం ప్రత్యేక ఫీచర్‌. ధర ఎంతో తెలుసా.?

Huawei Band 6: ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా కొనసాగుతోన్న వేళ తాజాగా హువావో కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జులై 12 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌లో అధునాతన ఫీచర్లను అందించారు..

TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 11, 2021 | 6:05 PM

 ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. వినియోగదారుల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతుండడంతో బడా కంపెనీలన్నీ వీటి తయారీలోకి అడుగుపెడుతున్నాయి.

1 / 6
ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హువావే ఇండియన్‌ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ బ్యాండ్‌ని ప్రవేశపెట్టింది. హువావే బ్యాండ్‌ 6 పేరుతో తీసుకొచ్చిన ఈ బ్యాండ్‌ సోమవారం (జులై 12) నుంచి అందుబాటులోకి రానుంది.

2 / 6
96 రకాల వర్కవుట్‌ మోడ్స్‌తో పాటు హార్ట్‌ బీట్‌ సెన్సార్‌, ఆక్సిజన్‌ స్థాయిలను తెలిపేలా దీన్ని రూపొందించారు. కేవలం మహిళలకు ఉపయోగపడేలా (బుతు చక్రాన్ని టాక్‌ చేసేలా) ఇందులో ఓ ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చారు.

3 / 6
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఫుల్‌ ఛార్జింగ్ చేస్తే ఏకంగా రెండు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. వీటి పట్టీలను సిలికాన్‌తో రూపొందించారు.. దీంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి.

4 / 6
1.47 అంగుళాల అమోల్‌డ్‌ వ్యూ కలర్ డిస్‌ప్లే (194*368 పిక్సెల్స్‌), 64 స్క్రీన్‌ టు బాడీ రేషియోను అందించారు.

5 / 6
అంతేకాకుండా స్లీప్‌ మానిటర్‌, ట్రూరిలాక్స్‌ ఒత్తిడి పర్యవేక్షణ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ బ్యాండ్‌ 50 మీటర్ల లోతు నీటిలో కూడా ఇది ప‌నిచేస్తుంది. ధర రూ. 4,490గా నిర్ణయించారు.

6 / 6
Follow us