Water: ఇలాంటి సందర్భాల్లో నీటిని అలా తాగితే ప్రాణాలకే ప్రమాదం..
మనిషి అన్నం తినకుండా రెండు రోజులైన ఉండగలడు గానీ.. నీరు లేకుండా మాత్రం అస్సలు ఉండలేడు. వాస్తవానికి మనిషి శరీరంలో కూడా అధిక శాతం మంచినీరే ఉంటుంది. అసలు మనిషికి సరైన నీరు అందకపోతే శరీరం లోపల ఎలాంటి పనులు కూడా జరగవు. ఎక్కడిక్కడే అన్ని స్తంభించిపోతాయి. అయితే మరో విషయం ఏంటంటే నీళ్లు తాగే విషయంలో కూడా అనేక పరిమితులు ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటించాలి. ఒకవేళ వీటిపై అజాగ్రత్త వహిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

మనిషి అన్నం తినకుండా రెండు రోజులైన ఉండగలడు గానీ.. నీరు లేకుండా మాత్రం అస్సలు ఉండలేడు. వాస్తవానికి మనిషి శరీరంలో కూడా అధిక శాతం మంచినీరే ఉంటుంది. అసలు మనిషికి సరైన నీరు అందకపోతే శరీరం లోపల ఎలాంటి పనులు కూడా జరగవు. ఎక్కడిక్కడే అన్ని స్తంభించిపోతాయి. అయితే మరో విషయం ఏంటంటే నీళ్లు తాగే విషయంలో కూడా అనేక పరిమితులు ఉన్నాయి. వీటిని కచ్చితంగా పాటించాలి. ఒకవేళ వీటిపై అజాగ్రత్త వహిస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే మన శరీరంలో నీటి అసమతుల్యలు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఓవర్ హైడ్రైషన్, డీ హైడ్రేషన్ ఇవి రెండూ కూడా శరీరానికి హాని కలిగిస్తాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం.
దీనినే వాటర్ ఇంటాక్సికేషన్ లేదా ఓవర్ హైడ్రేషన్ అని పిలస్తారు. అయితే అవసరానికి మించి ఒకవేళ నీరు తీసుకున్నప్పుడు ఈ ఓవర్ హైడ్రేషన్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరంలోని రక్తప్రసరణలో అవసరమయ్యేటటువంటి ఎలక్ట్రోలైట్లను పలుచన చేస్తుంది. ఈ ప్రభావం వల్ల శరీరంలోని ప్రతికూలతలు మొదలవుతాయి. ముఖ్యంగా తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే వాంతులు, మార్ఛలు కూడా వస్తుంటాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే తీవ్రమైన సందర్భాలు వచ్చినప్పుడు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఈ ఓవర్ హైడ్రైషన్ అనే అనర్థం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పడు వెంటనే చికిత్స అందించాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు ఒకేసారి అలా తాగకూడదు. ఇలాంటి చిన్న తప్పు చేయడం వల్ల ప్రాణల మీదకు తెచ్చుకునే పరిస్థితులు కూడా వస్తాయి.
డీ హైడ్రేషన్ ఈ పదాన్ని చాలా మంది వినే ఉంటారు. వాస్తవానకి మన శరీరం అధికంగా ద్రవాలను కోల్పోయినప్పుడు ఈ డీ హైడ్రేషన్ సంభవిస్తుంది. విధులకు తోడ్పడేందుకు అవసరమైన నీరు అందుబాటులో ఉండదు. అలాగే విపరీతంగా చెమటలు కారడం, విరేచనాలు రావడం లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వాంతులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా శరీరంలో తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల డీ హైడ్రేషన్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో గొంతు పొడారిపోవడం, దాహం అలసట లాంటివి ఏర్పడతాయి. ఒకవేళ డీహైడ్రైషన్ తీవ్రతరమైనట్లైతే మూత్రపిండాలు కూడా విఫలమవుతాయి. దీనివల్ల ప్రాణాలకే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది. అందుకే దాహం వేసినప్పుడు కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలి. ఎక్కువ సేపు నీరు తాగకుండా ఉండటం వల్ల ఈ డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.




మరిన్ని హెల్త్ న్యూస్ కోసం