AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type 2 Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఈ 5 శరీర భాగాలు దెబ్బతింటాయని మీకు తెలుసా..? అప్రమత్తంగా లేకపోతే తీరని నష్టం

దేశ వ్యాప్తంగా 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలుస్తారు. అయితే దేశంలో సగానికి పైగా మందికి ఈ వ్యాధిపై సరైన అవగాహన లేదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి శరీరక వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి కారణాలు టైప్-2 డయాబెటిస్‌కు కారణం అవుతాయి. పెద్ద సమస్య ఏమిటంటే.. ఈ దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో సులభంగా..

Type 2 Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఈ 5 శరీర భాగాలు దెబ్బతింటాయని మీకు తెలుసా..? అప్రమత్తంగా లేకపోతే తీరని నష్టం
High Blood Sugar
Srilakshmi C
|

Updated on: Feb 28, 2024 | 12:42 PM

Share

దేశ వ్యాప్తంగా 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలుస్తారు. అయితే దేశంలో సగానికి పైగా మందికి ఈ వ్యాధిపై సరైన అవగాహన లేదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి శరీరక వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి కారణాలు టైప్-2 డయాబెటిస్‌కు కారణం అవుతాయి. పెద్ద సమస్య ఏమిటంటే.. ఈ దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో సులభంగా గుర్తించలేం. కానీ, మధుమేహ వ్యాధి లక్షణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు అలసట, ఊబకాయం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు శరీరంలోని ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తాయి. చక్కెర వల్ల ఏ అవయవాలు ప్రభావితం అవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మం

మధుమేహ వ్యాధిగ్రస్తులలో చర్మ సమస్యలు చాలా సాధారణం. రక్తంలో అధిక చక్కెర వల్ల రక్తనాళాలు దెబ్బతినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. పిగ్మెంటేషన్ సమస్యలు కూడా వస్తాయి. చేతులు, పాదాలు, మెడ దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తాయి. అవి ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ ఈ చర్మ సమస్య ద్వారా సులభంగా మధుమేహ వ్యాధిని తెలుసుకోవచ్చు.

గుండె

మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండెను దెబ్బతీస్తాయి అనడంలో సందేహం లేదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి సంభవించవచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

పాదాలు

పాదాలలో సున్నితత్వం పెరగడం, తిమ్మిరి మధుమేహం లక్షణాలు. రక్తంలో అధిక చక్కెర రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఇది రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలను విస్మరించకూడదు.

కళ్లు

మధుమేహంతో కంటి సమస్యలు పెరుగుతాయి. దృష్టి తగ్గుతుంది. అంతేకాకుండా కంటిలో శుక్లాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. కొన్నిసార్లు రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. మధుమేహం వల్ల కూడా చూపు తగ్గుతుంది.

కిడ్నీ

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. చక్కెర స్థాయి పెరిగినప్పుడు కిడ్నీలు ఎక్కువగా దెబ్బతింటాయి. చక్కెర మూత్రపిండాల పనితీరును నిరోధిస్తుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీస్తుంది. ఈ సందర్భంలో, డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.