AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type 2 Diabetes: ఈ లక్షణలు కనిపిస్తుంటే జాగ్రత్త.. కంటి నుంచి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం..

షుగర్ వ్యాధి లక్షణాల గురించి తప్పనిసరిగా గుర్తించాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు అలసట, ఊబకాయం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కావు.. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావితం చేస్తాయి. చక్కెర వల్ల ఏ అవయవాలు ప్రభావితమవుతాయో చూడండి.

Type 2 Diabetes: ఈ లక్షణలు కనిపిస్తుంటే జాగ్రత్త.. కంటి నుంచి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం..
Type 2 Diabetes
Surya Kala
|

Updated on: Feb 28, 2024 | 11:45 AM

Share

దేశంలో 7 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అని పిలుస్తున్నారు. అయితే బాధితుల్లో సగం మందికి కూడా ఈ వ్యాధిపై అవగాహన లేదు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుండి వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి కూడా టైప్-2 డయాబెటిస్‌కు కారణాలు. అతి పెద్ద సమస్య ఏమిటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు సులభంగా గుర్తించబడవు. అయితే షుగర్ వ్యాధి లక్షణాల గురించి తప్పనిసరిగా గుర్తించాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు అలసట, ఊబకాయం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కావు.. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావితం చేస్తాయి. చక్కెర వల్ల ఏ అవయవాలు ప్రభావితమవుతాయో చూడండి.

చర్మం: మధుమేహ వ్యాధిగ్రస్తులలో చర్మ సమస్యలు చాలా సాధారణం. చక్కెర వల్ల రక్తనాళాలు దెబ్బతినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. చాలా పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి. చేతులు, పాదాలు, మెడ దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తాయి. అవి చాలా హానికరం కాదు. కనుక చర్మ సమస్య బట్టి సులభంగా మధుమేహం లక్షణంగా చూడవచ్చు.

గుండె: మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె పని తీరుని దెబ్బతీస్తాయి అనడంలో సందేహం లేదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సంఘటనలు సంభవించవచ్చు. మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

పాదాలు: పాదాలలో సున్నితత్వం పెరగడం, తిమ్మిరి మధుమేహం లక్షణాలు. అధిక రక్త చక్కెర రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఇది రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

కళ్లు: మధుమేహంలో కంటి సమస్యలు పెరుగుతాయి. చూపు తగ్గుతుంది. అంతేకాకుండా కంటిలో శుక్లాలు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అధిక రక్తంలో చక్కెర స్థాయిల కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. మధుమేహం వల్ల కూడా చూపు తగ్గుతుంది.

కిడ్నీ: శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఈ అవయవం ఎక్కువగా దెబ్బతింటుంది. చక్కెర మూత్ర పిండాల పనితీరును నిరోధిస్తుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా దారి తీస్తుంది. ఈ సందర్భంలో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)