ముడతలు తొలగించడానికి దోసకాయ ప్యాక్ ట్రై చేయవచ్చు. దోసకాయలో సిలికా అనే పదార్థం ఉండటం వల్ల చర్మం కుంగిపోకుండా చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల దోసకాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొన, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకు రసం, తగినంత యాపిల్ పేస్ట్ తీసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే ప్యాక్ రెడీ అయినట్లే. దీనిని ముఖం అంతా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నీళ్లతో ముఖం కడుక్కుంటే సరి.