WITT: కాంగ్రెస్‌ నేతలకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీదీ.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌ షా..

దేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ పవర్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా భారతరత్న, పద్మ అవార్డుల గురించి మాట్లాడారు. దేశ అత్యున్నత పురస్కారలైన ఈ అవార్డుల విషయంలో ఎలాంటి రాజకీయం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు..

Narender Vaitla

|

Updated on: Feb 28, 2024 | 11:49 AM

దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న, పద్మ అవార్డుల విషయంలో బీజేపీ, ఎన్డీయో, మోదీ ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయం చేయలేదని అమిత్‌షా తెలిపారు. భారతరత్న, పద్మ అవార్డులను ఇంట్లో కుటుంబ సభ్యులకు పంపిణీ చేయలేదని కేవలం అర్హులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు.

1 / 5
ముందుగా భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ తర్వాతే కొందరు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారికి కూడా బీజేపీ భారతరత్న ఇచ్చిందన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి బీజేపీ ఏం సాధించిందని అమిత్‌షా ప్రశ్నించారు. తరుణ్‌ గొగోయ్‌కి భారతరత్న ఇచ్చి ఏం సాధించారన్నారు.

2 / 5
తాత, నాన్న, అమ్మలకు భారతరత్న ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ కాదని అన్నారు. భావజాలం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తాము వారిని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నారు.

3 / 5
పద్మ అవార్డులను అర్హులైన వారికే ఇచ్చారని అమిత్‌ షా అన్నారు. అంతకుముందు కొంతమంది జర్నలిస్టుల సిఫార్సుతో అవార్డులు ఇచ్చే వారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.

4 / 5
కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సర్దార్‌ పటేల్‌ను తాము గౌరవించామని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రగల్భాలు పలికే వ్యక్తుల కేటాయింపులు రాజకీయంగా చేయరాదన్నారు. అర్హులైన వారికి భారతరత్న ఇచ్చే పనిని ప్రధాని మోదీ చేశారనని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

5 / 5
Follow us