AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri: ఆర్ధిక ఇబ్బందులా.. మహా శివరాత్రి రోజున చేయాల్సిన దానాలు, అభిషేకం ఏమిటంటే..

మహా  శివరాత్రి రోజున తీసుకునే కొన్ని చర్యలు జీవితంలో అద్భుత మార్పులను తీసుకువస్తాయి. 2024లో మహా శివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగం ఆర్థిక లాభానికి,  పని సాఫల్యానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మాఘ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి తిథిలో వచ్చే మహా శివరాత్రి రోజున మీరు ఏ వస్తువులను దానం చేయవచ్చు?  ఏఏ దానం వలన విశిష్ట ఫలితం దక్కుతుందో ఈ రోజు తెలుసుకుందాం.. 

Mahashivratri: ఆర్ధిక ఇబ్బందులా.. మహా శివరాత్రి రోజున చేయాల్సిన దానాలు, అభిషేకం ఏమిటంటే..
Maha Shivaratri 2024
Surya Kala
|

Updated on: Feb 28, 2024 | 10:43 AM

Share

హిందువులకు మహా శివరాత్రి పండగ ప్రత్యేకమైంది. ఈ ఏడాది మహా శివరాత్రి పండుగను 8 మార్చి 2024న అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు మహాశివరాత్రి అని..  ఈ రోజున శివయ్య లింగోద్భవం జరిగిందని విశ్వాసం. మహా  శివరాత్రి రోజున తీసుకునే కొన్ని చర్యలు జీవితంలో అద్భుత మార్పులను తీసుకువస్తాయి. 2024లో మహా శివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగం ఆర్థిక లాభానికి,  పని సాఫల్యానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మాఘ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి తిథిలో వచ్చే మహా శివరాత్రి రోజున మీరు ఏ వస్తువులను దానం చేయవచ్చు?  ఏఏ దానం వలన విశిష్ట ఫలితం దక్కుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

మహా శివరాత్రి నాడు ఈ 4 వస్తువులు దానం చేయండి

నెయ్యి దానం చేయండి:

మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు. అంతే కాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం వలన జీవితంలో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే, అది కూడా తొలగించబడుతుంది.

పాల దానం

మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేయడం వలన జాతకంలో చంద్రుడు బలపడి మానసిక ప్రశాంతత పొందుతాడు.

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వులను దానం

మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృ దోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా.. ఎప్పటి నుంచో ఆటంకాలు ఏర్పడుతున్న పనులు పూర్తవుతాయి.

బట్టలు దానం

మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మీ జీవితం నుండి ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శంకరుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఈ వస్తువులతో శివునికి అభిషేకం

  1. మహాశివరాత్రి రోజున పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం.
  2. ఇలా చేయడం వల్ల భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివయ్య అనుగ్రహం చెక్కుచెదరకుండా ఉంటుంది.
  3. శివరాత్రి రోజున పెరుగుతో శంకరుని రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
  4. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
  5. శివుని ప్రతిష్ఠించేటప్పుడు  ‘ఓం పార్వతీపతయే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికీ లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది