Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ganesh: నేడు అత్యంత విశిష్టమైన రోజు.. గణపతి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి.. ఇలా పూజించండి.. కోరిన కోర్కెలు తీరతాయి

మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజుని సంకష్టి చతుర్థిగా జరుపుకుంటారు. సంకష్టి చతుర్థి రోజు దేవతలందరిలో ఆదిపూజ్యుడైన గణేశుడికి అంకితం చేయబడింది. గణేశుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. కనుక గణేశుని అనుగ్రహం పొందడానికి, భక్తులు ఈ రోజున వ్రతం చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

Lord Ganesh: నేడు అత్యంత విశిష్టమైన రోజు.. గణపతి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి.. ఇలా పూజించండి.. కోరిన కోర్కెలు తీరతాయి
Lord Ganesha
Follow us
Surya Kala

|

Updated on: Feb 28, 2024 | 9:33 AM

హిందూమతంలో బుధవారం విఘ్నాలకధిపతి వినాయకుడికి అంకితం చేసిన రోజు. బుధవారం వినాయకుడిని పూజించడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. అయితే ఈ రోజు సంకష్టి చతుర్థి కూడా రావడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజుని సంకష్టి చతుర్థిగా జరుపుకుంటారు. సంకష్టి చతుర్థి రోజు దేవతలందరిలో ఆదిపూజ్యుడైన గణేశుడికి అంకితం చేయబడింది. గణేశుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. కనుక గణేశుని అనుగ్రహం పొందడానికి, భక్తులు ఈ రోజున వ్రతం చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

సంకష్ట చతుర్థి రోజున ఇలా పూజించండి

సంకష్టి చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి. ఆ తరువాత స్నానం చేసి, శుభ్రమైన, చక్కని బట్టలు ధరించండి. ఇంటిలోని పూజా స్థలాన్ని లేదా ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు ఒక పీఠాన్ని ఏర్పరచి దానీపై ఎర్రటి వస్త్రాన్ని పరచి.. గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, విగ్రహం దగ్గర నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటు చేయండి. ఇప్పుడు వినాయకుని విగ్రహం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేయండి,

ఇప్పుడు గణేశుడికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, దూర్వా, తమలపాకులతో పూజ చేసి నైవేద్యంగా కుడుములు సమర్పించండి. దీని తరువాత, గణేష్ మంత్రాన్ని జపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మంత్రాన్ని జపించిన తర్వాత, గణేష్ చాలీసాను పఠించండి. ఇప్పుడు గణేశునికి హారతినిచ్చి అనంతరం ఇతర దేవతలకు పూజ చేసి హారతిని ఇచ్చి పూజ ముగించండి. పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు గణేశుని క్షమించమని కోరండి. దీని తర్వాత అందరికీ ప్రసాదం పంచండి. నమ్మకం ప్రకారం, సంకష్ట చతుర్థి ఉపవాసం రాత్రి చంద్రుడిని పూజించిన అనంతరం ఉపవాస దీక్షను విరమించుకోవాలి.

ఇవి కూడా చదవండి

సంకష్టి చతుర్థి మతపరమైన ప్రాముఖ్యతను తెలుసుకోండి

గణేశుడిని అడ్డంకులు, కష్టాలను తొలగించే దేవుడుగా విశ్వాసం. గణేశుడు ప్రసన్నుడవుతాడు. భక్తుల అన్ని రకాల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండి, వినాయకుడిని పూజించడం వల్ల భక్తులకు అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ వ్రత ప్రభావంతో, సాధకుడు జీవితంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం పొందుతాడు. కోరికలన్నీ నెరవేరుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు