AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anam vs TTD: టీటీడీ బోర్డు సభ్యులపై ఆనం ఆరోపణలు.. పరువు నష్టదావా వేస్తామన్న టీటీడీ

దాతల విజ్ఞప్తి మేరకే ముంబైలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేందుకు ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. దీంతో భక్తులు శ్రీవారికి సమర్పించిన నగదును దుర్వినియోగం చేస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. దీనిపై టీటీడీ బోర్డ్ తీవ్రంగా స్పందించింది.

Anam vs TTD: టీటీడీ బోర్డు సభ్యులపై ఆనం ఆరోపణలు.. పరువు నష్టదావా వేస్తామన్న టీటీడీ
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Feb 28, 2024 | 6:30 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆనం వెంకటరమణా రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ బోర్డు సభ్యులు తీవ్రంగా ఖండించారు. శ్రీవారి ఖజానాను దుబారాగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలకు తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే విజ్ఞప్తి మేరకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ముంబైలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. దాతల విజ్ఞప్తి మేరకే ముంబైలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేందుకు ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు.

దీంతో భక్తులు శ్రీవారికి సమర్పించిన నగదును దుర్వినియోగం చేస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. దీనిపై టీటీడీ బోర్డ్ తీవ్రంగా స్పందించింది. దాతల ఖర్చుతోనే ప్రత్యేక విమానంలో ఛైర్మన్ ఈవో ముంబైకి వెళ్లారే తప్ప.. టీటీడీ ఎలాంటి ఖర్చు చేయలేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలపై పరువు నష్టదావా వేస్తామన్నారు.

టీటీడీ ధర్మకర్తల మండలి నియామకంలోనూ సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారన్నారు. ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలతో శ్రీవారి భక్తులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు బోర్డు కృషి చేస్తోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను రాజకీయాలతో ముడి పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ అని టీటీడీ ప్రశ్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..