Rajnath Singh: పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ విమర్శలు

ఏపీలో ఎన్నికల క్యాంపెయిన్‌ మొదలుపెట్టిన బీజేపీ. భారత్‌ రైజింగ్‌ పేరుతో విశాఖ వేదికగా మేధావుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మన దేశాన్ని నెంబర్‌ వన్‌ చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంటే.. ఉత్తర, దక్షిణ భారత్‌ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Rajnath Singh: పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ విమర్శలు
Rajnath Singh
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2024 | 10:01 PM

ఏపీలో ఎన్నికల క్యాంపెయిన్‌ మొదలుపెట్టిన బీజేపీ. భారత్‌ రైజింగ్‌ పేరుతో విశాఖ వేదికగా మేధావుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మన దేశాన్ని నెంబర్‌ వన్‌ చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంటే.. ఉత్తర, దక్షిణ భారత్‌ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్‌ అమ్మలాంటిదంటూ మండిపడ్డారు రాజ్‌నాథ్‌సింగ్. ఆ తర్వాత విజయవాడ వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్‌…పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో రాబోయే ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత ఏలూరులో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు ఆయన. ‘ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే నాకు విశ్వాసం కలుగుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు అని నాకు అనిపిస్తోంది.’ అని రాజ్ నాథ్ సింగ్‌ పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ సర్కార్‌ సీరియస్‌గా వ్యవహరించడం లేదని ఆరోపించారు రాజ్‌నాథ్‌ సింగ్‌. ‘ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ. 15 వేల కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరం పూర్తి చేయడంపై సీరియస్‌గా వ్యవహరించడం లేదు’ అంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి. ఇదిలా ఉంటే విజయవాడలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలవడానికి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో పొత్తుల గురించి రాజ్‌నాథ్‌ తన పర్యటనలో ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది

ఇవి కూడా చదవండి