Yadagiri Gutta: యాదాగీరిశుడికి వృద్ధ దంపతులు పరమ భక్తులు.. తమ సంపాదనలో కోట్ల ఆస్తిని నరసింహుడికి భూరి విరాళం
హనుమంతరావు ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. ఒకరు హైదరాబాదులో ఉండగా, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులు రామా.. కృష్ణ అంటూ శేష జీవితాన్ని సాగిస్తున్నారు. కోట్లాది మందికి ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి తమ సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ చైతన్యపురిలో వీరికి 260 గజాల్లో మూడంతస్తుల భవనం ఉంది.
తెలంగాణ ప్రజల ఇలవేల్పు ఏకశిఖర వాసుడు పాంచ నర్సింహుడికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం సాధారణమే. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వృద్ధ దంపతులు మూడు కోట్ల రూపాయల విలువైన భవనాన్ని విరాళంగా ఇచ్చారు.
హైదరాబాద్ చైతన్యపురికి చెందిన శారదా హనుమంతరావు దంపతులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పరమ భక్తులు. ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదగీరిశుడికి కోరికలు తీరిన వెంటనే మొక్కులు చెల్లించుకునేవారు. హనుమంతరావు ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. ఒకరు హైదరాబాదులో ఉండగా, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ దంపతులు రామా.. కృష్ణ అంటూ శేష జీవితాన్ని సాగిస్తున్నారు.
కోట్లాది మందికి ఇంటి ఇలవేల్పుగా ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి తమ సంపాదనలో కొంత విరాళంగా ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ చైతన్యపురిలో వీరికి 260 గజాల్లో మూడంతస్తుల భవనం ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఈ భవనాన్ని శారద హనుమంతరావు దంపతులు స్వామివారికి విరాళంగా ఇచ్చారు.
చైతన్యపురిలోని భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వామి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను ఆలయ ఈవో రామకృష్ణారావుకు అందజేశారు. దీంతో యాదగిరిగుట్ట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎం. రామకృష్ణారావు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన భవనాన్ని స్వామివారికి విరాళంగా ఇవ్వడం పట్ల శారదా హనుమంతరావు దంపతులను ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతో సత్కరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..