AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Tea Benefits: సాల్ట్ టీ ఎప్పుడైనా తాగారా..? ప్రయోజనాలు పుష్కలం..! తెలిస్తే కంటిన్యూ అవుతారు..

అయితే కొందరికి టీ అతిగా తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మితంగా టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ టీకి కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును సాల్ట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఎలా తయారుచేయాలి దీనివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Salt Tea Benefits: సాల్ట్ టీ ఎప్పుడైనా తాగారా..? ప్రయోజనాలు పుష్కలం..! తెలిస్తే కంటిన్యూ అవుతారు..
Salt Tea
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2024 | 3:40 PM

Share

మనలో చాలా మందికి టీ తాగడం చాలా ఇష్టం. కొందరికి టీ అంటే ఎమోషన్. కొందరికీ నిద్రలేచింది మొదలు కప్పు చాయ్‌ కడుపులో పడితే గానీ ఏ పని జరగదు. ఇకపోతే, టీ అనేది చాలా రకాలుగా తయారు చేస్తారు. కొందరు అల్లం టీ, ఇలాంచి టీ, పుదీనా టీ, బెల్లం టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ , హెర్బల్ టీ ఇలా ఎన్నో వెరైటీల్లో టీ తయారు చేస్తారు. అయితే కొందరికి టీ అతిగా తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మితంగా టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ టీకి కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును సాల్ట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఎలా తయారుచేయాలి దీనివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాల్ట్​ టీ తయారుచేయడం చాలా ఈజీ పని. మామూలుగా చేసే టీలో కాస్త ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. కణజాలంలోకి పోషకాలు మరింత సులభంగా చేరుతాయి. సాల్ట్ టీ రక్తపోటు నియంత్రణకు, కడుపులో కావాల్సినంత జీర్ణరసం ఉత్పత్తికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ల బెడద తప్పుతుంది. చలికాలం ముగుస్తున్న సమయంలో కనీసం రెండు సార్లు ఈ టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జపాన్, యూరప్ వంటి దేశాలలో ఈ రకమైన టీ వారి ఆహారంలో భాగం.

టీలో ఉప్పు కలపడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు..

శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది..

ఇవి కూడా చదవండి

– ఉప్పులో సోడియం మరియు క్లోరైడ్ ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. కండరాల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

– శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. టీలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

– సాల్టెడ్ టీ తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

– రోగనిరోధక జీవక్రియకు మేలు చేస్తుంది. సాల్టెడ్ టీ తాగడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తి మరియు జీవక్రియను పెంచుతుంది.

– మైగ్రేన్‌లను తగ్గిస్తుంది. మైగ్రేన్ అనేది నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఓ మోస్తరు ఉప్పుతో టీ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

– ఉప్పులో శరీరానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా టీలో ఉప్పు కలపడం మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..