Interesting Facts: ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వొద్దని చెబుతారు.. ఇవే కారణాలు..
భారత దేశం.. సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మనం నిత్యం చేసే ప్రతి పనికి కూడా అర్థం ఉంటుంది. పూర్వం నుంచి కూడా ఇప్పటికీ కొన్ని రకాల ఆచారాలు వస్తూ ఉన్నాయి. కొన్నింటిలో మార్పులు జరిగినా.. ఇంకొన్నింటిని మాత్రం జనం ఆచరణ చేస్తూ ఉంటారు. వాటిలో ఉప్పుకు సంబంధించిన విషయం కూడా ఒకటి ఉంది. ప్రతీ వంట గదిలో కూడా ఉప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పు లేకపోతే.. భోజనానికి అసలు రుచి అనేదే ఉండదు. భారత దేశంలో ఉప్పును చేతి నుంచి..
భారత దేశం.. సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మనం నిత్యం చేసే ప్రతి పనికి కూడా అర్థం ఉంటుంది. పూర్వం నుంచి కూడా ఇప్పటికీ కొన్ని రకాల ఆచారాలు వస్తూ ఉన్నాయి. కొన్నింటిలో మార్పులు జరిగినా.. ఇంకొన్నింటిని మాత్రం జనం ఆచరణ చేస్తూ ఉంటారు. వాటిలో ఉప్పుకు సంబంధించిన విషయం కూడా ఒకటి ఉంది. ప్రతీ వంట గదిలో కూడా ఉప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పు లేకపోతే.. భోజనానికి అసలు రుచి అనేదే ఉండదు. భారత దేశంలో ఉప్పును చేతి నుంచి మరొకరి చేతికి ఇవ్వ కూడదని అంటాడరు. ఈ విషయం మీక కూడా తెలుసు. ఎందుకు అని చాలా మంది ఆలోచించే ఉంటారు. దీనికి పెద్దలు చాలా కారణాలు చెబుతూ ఉంటారు. అసలు చేతికి ఉప్పు అనేది ఎందుకు ఇవ్వ కూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ధార్మిక కారణాలు:
హిందూ ధర్మంలో ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం ఇంట్లో ఉప్పు ఉండేలా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు కాబట్టి.. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి ఇవ్వరు. ఎందుకంటే వారి చేతి నుంచి సిరి సంపదలు వెళ్లిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే గొడవలు అవుతాయి అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఉప్పుతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని బయటకు వెళ్లగొట్టొచ్చు.
సామాజిక కారణాలు:
పూర్వం ఉప్పును విలువైన వస్తువుగా భావించేవారు. ఉప్పును అప్పట్లో చాలా కష్ట పడి సంపాదించేవారు. అందుకే చేతితో ఇవ్వడం వల్ల వృథా అయిపోతుందని అంటారు. అంతే కాకుండా ఒకరి చేతికి ఉప్పును చేతితో ఇవ్వడం కూడా అవమానకరంగా భావిస్తారు. ఎందుకంటే ఉప్పు అనేది తీపికి వ్యతిరేకంగా.. చేతితో ఎదుటివారికి ఉప్పు ఇవ్వడం వల్ల వారి జీవితంలో తీపి లేదని కోరుకోవడం వంటివి అనుకుంటారని ఇవ్వరు.
సైన్స్ పరంగా..
ఉప్పు అనేది ఒక శోషకం. ఇది శరీరంలోని చెమటను ఎక్కువగా పీల్చుకుంటుంది. దీని వల్ల చేతులు అనేవి త్వరగా పొడిబారి పోవడం, చికాకు కలిగించడం జరుగుతుంది. అంతే కాకుండా చేతులు శుభ్రంగా లేకపోవతే.. వైరస్, బ్యాక్టీరియాలు కూడా రావచ్చు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి.