AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వామ్మో… వైజాగ్ బీచ్‌లో వింత జీవి.. హడలెత్తిపోయిన స్థానికులు..! తీరా చూస్తే..

గతంలో మనం ఎప్పుడూ చూడని పాముల లాంటివి తీరానికి వస్తూ ఉంటాయి. అలానే ఇటీవల తీరానికి కొట్టుకు వచ్చిన ఒక చెక్క పెట్టె అందరినీ పరుగులు పెట్టించింది. అందరిలో విపరీతమైన ఆసక్తిని పెంచింది. తీరా దాన్ని రెండు ప్రాక్లైనర్లు పెట్టీ ఓపెన్ చేస్తే చెక్క దిమ్మెలు తప్ప మరేం కనపడలేదు. ఇలా నిరంతరం విశాఖ తీరంలో ఇలాంటి వింతలు కనిపిస్తూనే ఉంటాయి.

Andhra Pradesh: వామ్మో... వైజాగ్ బీచ్‌లో వింత జీవి.. హడలెత్తిపోయిన స్థానికులు..! తీరా చూస్తే..
Huge Snake
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 28, 2024 | 3:21 PM

Share

విశాఖపట్నం, ఫిబ్రవరి24; విశాఖ సాగర తీరంలో సాగర్ నగర్ బీచ్ ఒకటి ఉంది. ఇక్కడ ఎప్పుడూ పెద్దగా హడావుడి కనిపించదు. కానీ, మత్స్యకార సోదరులు వేటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా సందడిగా కనిపిస్తుంటుంది. అలాంటి చోట వింత పాము కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా పిలుస్తారట. ఈ కళేబరం విషయం తెలిసి అక్కడకు చేరుకున్న మత్స్యశాఖ అధికారులు… దీనిని నల పాము అంటారని తెలిపారు. మత్స్యకారుల వలకు చిక్కిన ఈ నల పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉందొచ్చని మత్స్య శాఖ అధికారులు వివరించారు.

అదే సమయంలో వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై కూడా ఈ పాములు చనిపోతాయని మత్స్య శాఖ అధికారులు వివరించారు. ఈ భారీ పాము కళేబరం విషయం తెలిసి దానిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి దగ్గర్లో ఉన్న ఈ కళేబరం ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

విశాఖ తీరం లో నిరంతరం ఇలాంటి వింతలు..

విశాఖ తీరంలో ఇలాంటి వింతలు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. రకరకాల విచిత్రమైన జంతువుల ఆనవాళ్లు, వాటి కళేబరాలు దొరుకుతూనే ఉంటాయి. ఇటీవల సి హార్స్ పేరుతో ఒక చేప వింత ఆకారంలో తీరానికి చేరింది. అదే సమయంలో మరికొన్ని వింత పాములు, గతంలో మనం ఎప్పుడూ చూడని పాముల లాంటివి తీరానికి వస్తూ ఉంటాయి. అలానే ఇటీవల తీరానికి కొట్టుకు వచ్చిన ఒక చెక్క పెట్టె అందరినీ పరుగులు పెట్టించింది. అందరిలో విపరీతమైన ఆసక్తిని పెంచింది. తీరా దాన్ని రెండు ప్రాక్లైనర్లు పెట్టీ ఓపెన్ చేస్తే చెక్క దిమ్మెలు తప్ప మరేం కనపడలేదు. ఇలా నిరంతరం విశాఖ తీరంలో ఇలాంటి వింతలు కనిపిస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…