AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కాతమ్ముళ్ల ప్రేమ అంటే ఇదే.. విమానంలో తమ్ముడికి ఘన స్వాగతం చెప్పిన అక్క.. కోట్లాది మంది హృదయాన్ని దోచుకున్న వీడియో ..

ఇండిగోకు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.  ఇందులో అందమైన అక్కాతమ్ముళ్ల సంబంధానికి చెందిన ప్రేమను చూడవచ్చు. ఈ వీడియోలో ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ రియా రాజేష్ డియోకర్, ఆమె సోదరుడు హర్ష్ డియోకర్ ఇటీవలే విమానయాన సంస్థకు చెందిన  సాంకేతిక బృందంలో నియమించబడ్డారు. రియాకు ఇది చాలా గర్వకారణం అయింది. అందుకే తన తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలని అక్క భావించింది.

అక్కాతమ్ముళ్ల ప్రేమ అంటే ఇదే.. విమానంలో తమ్ముడికి ఘన స్వాగతం చెప్పిన అక్క.. కోట్లాది మంది హృదయాన్ని దోచుకున్న వీడియో ..
Brother And Sister LoveImage Credit source: Instagram/capri.hostie
Surya Kala
|

Updated on: Feb 28, 2024 | 1:06 PM

Share

సోదర-సోదరి సంబంధం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన సంబంధాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల ప్రేమ, గొడవలు కూడా అందంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే సోదర, సోదరమణులు ఎలా గొడవ పడతారో ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటారు. అయితే కొంత సమయం తర్వాత వారి కోపం తగ్గి మళ్లీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. సాధారణంగా సోదరులు, సోదరీమణులు ఒకే కంపెనీలో, ఒకే స్థలంలో పనిచేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక అక్కాతమ్ముళ్ల ప్రేమకు చెందిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూపరులను భావోద్వేగానికి గురి చేస్తుంది.

వాస్తవానికి ఇండిగోకు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.  ఇందులో అందమైన అక్కాతమ్ముళ్ల సంబంధానికి చెందిన ప్రేమను చూడవచ్చు. ఈ వీడియోలో ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ రియా రాజేష్ డియోకర్, ఆమె సోదరుడు హర్ష్ డియోకర్ ఇటీవలే విమానయాన సంస్థకు చెందిన  సాంకేతిక బృందంలో నియమించబడ్డారు. రియాకు ఇది చాలా గర్వకారణం అయింది. అందుకే తన తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలని అక్క భావించింది. తాను పనిచేస్తున్న విమానంలోకి అడుగుపెట్టగానే తమ్ముడిని కౌగిలించుకుని సాదరంగా స్వాగతం పలికింది. అంతేకాదు గుర్తు పెట్టుకునే విధంగా బహుమతి కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

రియా తన సోదరుడికి స్వాగతం చెబుతూ సర్ ప్రైజ్ చేసిన వీడియోలో చూడవచ్చు. హర్ష ఇండిగోలో అసోసియేట్ టెక్నీషియన్‌గా చేరినట్లు చెప్పారు. అతనిని ఎయిర్లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ యూనిఫాంలో చూడవచ్చు. ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో capri.hostie అనే IDతో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటి వరకు 4.9 మిలియన్లు అంటే 49 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే 2.5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కొందరైతే ‘బెస్ట్ మూమెంట్’ అని అంటుంటే మరికొందరు ఇలాంటి అవకాశాలు అందరి జీవితంలోకి రావని అంటున్నారు. అదే విధంగా మీరిద్దరిపై ఎవరి దిష్టి పడకూడదని కొందరు యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..