Work From Hospitals: వర్క్‌ఫ్రం హోం చేసుకునే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.! ఇకపై వర్క్‌ఫ్రం హాస్మిటల్‌..

ఐటీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌... ఇకపై వర్క్‌ఫ్రం హాస్పిటల్‌ అందుబాటులోకి రానుంది. అవును. ఇంట్లో ఏవరైనా చిన్నపిల్లలు, పెద్దవారికి లేదా తమకే ఆరోగ్యం బాగులేనపుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుంది. అయితే వీక్‌ డేస్‌లో అయితే ఫరవాలేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రత్యేకంగా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ సందర్భాల్లో మాత్రం ఉద్యోగరీత్యా వెళ్లడం కుదరకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే ఆ రోజు సెలవు పెట్టాల్సిందే.

Work From Hospitals: వర్క్‌ఫ్రం హోం చేసుకునే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.! ఇకపై వర్క్‌ఫ్రం హాస్మిటల్‌..

|

Updated on: Feb 28, 2024 | 11:48 AM

ఐటీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌… ఇకపై వర్క్‌ఫ్రం హాస్పిటల్‌ అందుబాటులోకి రానుంది. అవును. ఇంట్లో ఏవరైనా చిన్నపిల్లలు, పెద్దవారికి లేదా తమకే ఆరోగ్యం బాగులేనపుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుంది. అయితే వీక్‌ డేస్‌లో అయితే ఫరవాలేదు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రత్యేకంగా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ సందర్భాల్లో మాత్రం ఉద్యోగరీత్యా వెళ్లడం కుదరకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే ఆ రోజు సెలవు పెట్టాల్సిందే. డాక్టర్‌ చూసేది కొద్దిసేపే అయినా అక్కడ గంటల తరబడి ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోవాల్సిందే. వర్క్‌ఫ్రంహోమ్‌ చేసే టెకీలకు ఇకపై ఈ ఇబ్బంది తీరనుంది. హాస్పిటల్స్‌లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వర్క్‌ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో డాక్టరును సంప్రదించే సమయంలోనూ చేసే పనికి అంతరాయం కలగకుండా చూసుకోవచ్చు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించిన కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలోనే పనిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ల్యాప్‌టాప్‌పైనే పనిచేస్తున్నారు. దీంతో ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వీలు కలుగుతుంది. ఒక డెస్క్‌, వైఫై ఉంటే చాలు.

అయితే వర్క్‌ఫ్రంహోం ద్వారా పని చేసే ఉద్యోగులు ఎమర్జెన్సీలో ఆస్పత్రికి వెళ్లాల్సివస్తే తమతోపాటే ల్యాప్‌టాప్ తీసుకెళ్లి ఆస్పత్రిలోనే వర్క్‌ చేసుకోవచ్చు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లకు ఈ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. సెలవు దొరక్కపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నా ఆసుపత్రికి వెళ్లడం కుదరక చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు, దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. పిల్లల ఉద్యోగాలు, సెలవుల వంటి పరిస్థితి చూసి వీరే సర్దుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్న సదుపాయాలతో రోగులు, వారి సహాయకులు ముఖ్యంగా టెకీలకు కొంత వరకైనా ఉపయోగకరంగా ఉండనుంది. ఐటీ కారిడార్‌లోనే ఓ ప్రముఖ ఆసుపత్రి అక్కడికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎవరైనా పనిచేసుకునేందుకు ‘వర్క్‌ఫ్రమ్‌ ఆసుపత్రి’ సదుపాయాలు కల్పిస్తుంది. అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా వర్క్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us