Solar Radiation: సౌర రేడియేషన్‌తో భూమికి పెనుముప్పు.! వాతావరణమార్పులపై పరిశోధకులు.
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా గ్రహిస్తోందని, ఇది పెనుముప్పుకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సౌర రేడియేషన్‌ను భూమి గ్రహించడం ద్వారావాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు.
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా గ్రహిస్తోందని, ఇది పెనుముప్పుకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సౌర రేడియేషన్‌ను భూమి గ్రహించడం ద్వారావాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ వరకూ డేటాను పరిగణనలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. రేడియేషన్‌ను భూమి గ్రహించడం సంవత్సరమంతా ఒకే తీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్‌లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి గ్రహించడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

