కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ మరో వ్యక్తి కారు బానెట్‌పై వేలాడుతున్నా పట్టించుకోకుండా మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. వ్యక్తి కేకలు వేస్తూ బానెట్‌పై వేలాడుతున్నా కారును పోనిచ్చాడు. దీంతో సదరు వ్యక్తిని రక్షించడానికి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. కారును వెంబడించి అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ మరో వ్యక్తి కారు బానెట్‌పై వేలాడుతున్నా పట్టించుకోకుండా మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. వ్యక్తి కేకలు వేస్తూ బానెట్‌పై వేలాడుతున్నా కారును పోనిచ్చాడు. దీంతో సదరు వ్యక్తిని రక్షించడానికి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. కారును వెంబడించి అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని నోయిడాకు చెందిన రమేష్ కుమార్‌గా గుర్తించారు. నిందితుడు తన కారును వెనక నుంచి తాకడంతో ప్రశ్నంచడానికి అతని దగ్గరకు వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. తాను మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ వ్యక్తి కారును ముందుకు పోనిచ్చాడని, దాంతో తాను కారు బానెట్‌పైకి ఎక్కానని చెప్పాడు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే మూడు కిలో మీటర్ల దూరం ఆపకుండా పోనిచ్చాడని వాపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

