India – Pakistan: పాకిస్థాన్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే.! వీడియో..

సింధూ నది ఉపనది రావి జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహన్ని భారత్‌ పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లూ పాక్‌కు వెళ్లిన ఆ నీటిని ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. దీని వల్ల 32 వేల హెక్టార్లలో సాగుకు ఈ నీరు అందనుంది.

India - Pakistan: పాకిస్థాన్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే.! వీడియో..

|

Updated on: Feb 28, 2024 | 12:00 PM

సింధూ నది ఉపనది రావి జలాలన్నీ ఇక మనకే దక్కనున్నాయి. నాలుగున్నర దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి ఈ నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తవడంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహన్ని భారత్‌ పూర్తిగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లూ పాక్‌కు వెళ్లిన ఆ నీటిని ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. దీని వల్ల 32 వేల హెక్టార్లలో సాగుకు ఈ నీరు అందనుంది. అంతేగాక, ఈ డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తులో 20 శాతాన్ని జమ్మూకశ్మీర్‌కు ఇవ్వనున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకూ రావి జలాలు ఉపయోగపడనున్నాయి. 1960లో భారత్‌, పాక్‌ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు చెందాయి. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని భారత్‌ నిర్ణయించింది. ఇందుకోసం 1979లో పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది.

రావి నదిపై ఎగువవైపు రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌, కిందివైపు షాపుర్‌ కంది బ్యారేజ్‌ను నిర్మించేందుకు అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం షేక్‌ మహమ్మద్‌ అబ్దుల్లా, పంజాబ్‌ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. 2001లో రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తవ్వగా.. షాపుర్‌ కంది బ్యారేజ్‌ ఆగిపోయింది. దీంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహం కొనసాగింది. 2008లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణం ప్రారంభించారు. కానీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ మధ్య విభేదాలతో సంవత్సరానికే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరపడంతో నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ నిర్మాణం పూర్తవ్వడంతో ఆదివారం ఫిబ్రవరి 25 నుంచి పాక్‌కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో