మారిన సూర్యకిరణాల యాంగిల్‌.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్‌

మారిన సూర్యకిరణాల యాంగిల్‌.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్‌

Phani CH

|

Updated on: Feb 28, 2024 | 9:03 PM

‘సూర్యుడు ఉదయించే భూమి’గా జపాన్‌కు పేరుంది. ఇప్పుడు ఆ సూర్యుడే చంద్రుడిపైనా ఆ దేశానికి సహకరించాడు. నిద్రావస్థలోకి వెళ్లిపోయి.. ఇక పనిచేస్తుందో లేదో తెలియని స్థితిలో ఉన్న మూన్‌ ల్యాండర్‌ ‘స్లిమ్‌’పై తన కిరణాలను ప్రసరింపచేసి దాన్ని మేల్కొలిపాడు. దీంతో ఇటీవల చంద్రుడిపైకి పంపిన తమ ‘స్లిమ్‌’ జాబిల్లిపై రెండు వారాలపాటు కఠినమైన చంద్రరాత్రిని తట్టుకుని తిరిగి ప్రాణం పోసుకుందని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ జాక్సా తెలిపింది.

‘సూర్యుడు ఉదయించే భూమి’గా జపాన్‌కు పేరుంది. ఇప్పుడు ఆ సూర్యుడే చంద్రుడిపైనా ఆ దేశానికి సహకరించాడు. నిద్రావస్థలోకి వెళ్లిపోయి.. ఇక పనిచేస్తుందో లేదో తెలియని స్థితిలో ఉన్న మూన్‌ ల్యాండర్‌ ‘స్లిమ్‌’పై తన కిరణాలను ప్రసరింపచేసి దాన్ని మేల్కొలిపాడు. దీంతో ఇటీవల చంద్రుడిపైకి పంపిన తమ ‘స్లిమ్‌’ జాబిల్లిపై రెండు వారాలపాటు కఠినమైన చంద్రరాత్రిని తట్టుకుని తిరిగి ప్రాణం పోసుకుందని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ జాక్సా తెలిపింది. ఆదివారం రాత్రి స్లిమ్‌కు తాము ఒక కమాండ్‌ను పంపితే దానికి స్పందన వచ్చిందని సోమవారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. గత నెల 19న చంద్రుడిపై దిగే క్రమంలో సాంకేతిక సమస్యల వల్ల స్లిమ్‌ యాంగిల్‌ మారింది. దీంతో దానిలోని సోలార్‌ ప్యానెల్స్‌ సూర్యకిరణాలను అందుకోలేకపోయాయి. ఆ తర్వాత సూర్యుడి కోణం మారడంతో రెండు రోజులపాటు జీవం పోసుకున్న స్లిమ్‌ తన హై-స్పైక్‌ కెమెరాను ఉపయోగించి కొన్ని ఫొటోలు తీసి భూమికి పంపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరీరానికి జింక్‌ అవసరమని.. ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి

అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి విరాళాల వెల్లువ

మసాలాలతో క్యాన్సర్‌ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన

బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు