Weight Loss Tips: నిమ్మరసంలో ఈ గింజను కలుపుకుని తాగితే 15 రోజుల్లో బరువు తగ్గడం గ్యారెంటీ..!

బరువు తగ్గడానికి లెమన్ వాటర్ ఒక ముఖ్యమైన హోం రెమెడీ. చియా గింజలతో లెమన్‌ వాటర్‌ మిక్స్ చేయడం వల్ల బరువు తగ్గడానికి మంచి రెమిడీగా పనిచేస్తుంది. నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ కలిసి త్వరగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Weight Loss Tips: నిమ్మరసంలో ఈ గింజను కలుపుకుని తాగితే 15 రోజుల్లో బరువు తగ్గడం గ్యారెంటీ..!
Chia Seeds Mixed With Lemon Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 27, 2024 | 8:32 PM

బరువు తగ్గడానికి చాలా మంది అనేక మార్గాలను అనుసరిస్తారు. కానీ, అందరూ అంత తేలిగ్గా బరువు తగ్గలేరు. అయితే, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరించటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. అలాంటి ఇంటి చిట్కాలలో అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌ని నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న భావన కల్పిస్తాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మోతాదుకి మించి తినే అలవాటుకి దూరం చేసి బరువు తగ్గించేందుకు చీయా సీడ్స్‌ సహాయపడతాయన్నమాట. అయితే, నిమ్మరసంతో చియా సీడ్స్‌ ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి లెమన్ వాటర్ ఒక ముఖ్యమైన హోం రెమెడీ. చియా గింజలతో లెమన్‌ వాటర్‌ మిక్స్ చేయడం వల్ల బరువు తగ్గడానికి మంచి రెమిడీగా పనిచేస్తుంది. నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది. ఈ రెండూ కలిసి త్వరగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో చియా సీడ్స్, నీరు వేయండి. పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె కలపండి. ఇది 20 నుంచి 30 నిమిషాల తర్వాత పదార్థాలన్నీ మరోసారి కలపండి. అది కొద్దీగా జెల్లీలా తయారవుతుంది. అప్పుడు ఇక తాగడమే.

చియా విత్తనాలను నీటిలో నానబెట్టినప్పుడు జెల్‌గా మారుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను, కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. చియా గింజలను నిమ్మరసంలో కలిపి తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. ఇవి జీవక్రియను పెంచుతాయి. ఆహారంలో జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..