Waxing Tips: వ్యాక్సింగ్ చేసుకుంటున్నారా..? అయితే ఈ తప్పులు మాత్రం చేయకండి!
తరువాత చల్లని గుడ్డతో శరీరాన్ని శుభ్రంగా తుడిచేసుకోండి..ఈ వ్యాక్సింగ్ అనేది నెలలో రెండు సార్లు కానీ నెలకి ఒకసారి కానీ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాక్సింగ్ ప్రతి నెలా ఒక నియమిత షెడ్యూల్ ప్రకారం చేయించుకోవడం వల్ల వెంట్రుకలు ఎక్కువగా పెరగకుండా ఉంటాయి.
శరీరంలోని అవాంఛిత రోమాలను తొలగించి చేతులు, కాళ్లను అందంగా మార్చుకోవడానికి వ్యాక్సింగ్ చేస్తారు. దీనికోసం చాలామంది పార్లల్స్ కి వెళ్తారు. ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం నైపుణ్యం అవసరం. అయితే, వ్యాక్సింగ్ తర్వాత చర్మం పూర్తిగా నునుపుగా ఉంటుంది. అమ్మాయిలు కూడా అవాంఛిత రోమాలను తొలగించుకుని చేతులు, కాళ్లను అందంగా మార్చుకోవడానికి వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అయితే, ఈ సందర్భంలో మీరు చేసే కొన్ని తప్పులు మీ చర్మాన్ని డార్క్‌గా మార్చేస్తాయి. అలా అయితే, వ్యాక్సింగ్ తర్వాత ఎలాంటి తప్పులు నివారించాలో తెలుసుకోండి.
వ్యాక్సింగ్ తర్వాత ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు. దీని వల్ల చర్మం కందిపోయి, నల్లగా మారుతుంది. వ్యాక్సింగ్ తర్వాత సూర్యరశ్మికి గురికావడం వల్ల కూడా చర్మం నల్లగా కనిపిస్తుంది. వాక్సింగ్ తర్వాత కనీసం మూడు నాలుగు రోజుల వరకు స్క్రబ్ చేయవద్దు. లేదంటే చర్మానికి హాని కలుగుతుంది. అలాగే, వ్యాక్సింగ్ తర్వాత రసాయన క్రీములను ఉపయోగించవద్దు. వ్యాక్స్ స్కిన్ పై కెమికల్స్ వాడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. వాక్సింగ్ తర్వాత దురద రావచ్చు. ఆ సందర్భంలో దురద తగ్గించుకునేందుకు గట్టిగా గోకడం, కఠినమైన పదార్ధాలను ఉపయోగించడం ద్వారా ఇది మరింత పెరుగుతుంది. ఇది చర్మం ఎర్రబడటానికి కారణం కావచ్చు.
వాక్సింగ్ పూర్తయిన తర్వాత మీ శరీరాన్ని తుడవటానికి వెచ్చని వస్త్రాన్ని ఉపయోగించండి. తరువాత చల్లని గుడ్డతో శరీరాన్ని శుభ్రంగా తుడిచేసుకోండి..ఈ వ్యాక్సింగ్ అనేది నెలలో రెండు సార్లు కానీ నెలకి ఒకసారి కానీ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాక్సింగ్ ప్రతి నెలా ఒక నియమిత షెడ్యూల్ ప్రకారం చేయించుకోవడం వల్ల వెంట్రుకలు ఎక్కువగా పెరగకుండా ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..