AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మో.. తలపై గంగను మోస్తూ.. అందులో చేపల్ని కూడా పెంచుతుంది..! వీడియో చూస్తే అవాక్కే..

ఈ వీడియో చూసిన జనాలు కామెంట్స్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. కొందరు కూల్‌గా, మరికొందరు మూర్ఖత్వం అంటున్నారు. ఈ స్త్రీ తన జుట్టును ఎలా కడగుతుందని మరొకరు ఆందోళనగా అడుగుతున్నారు.? ఈ వీడియో చూసి జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే, మరోపక్క చాలా రకాల ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

Watch Video: అమ్మో.. తలపై గంగను మోస్తూ.. అందులో చేపల్ని కూడా పెంచుతుంది..! వీడియో చూస్తే అవాక్కే..
Aquarium On Womans Head
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2024 | 9:10 PM

Share

సోషల్ మీడియాలో కంటెంట్ ఎంత విభిన్నంగా, వింతగా ఉంటే వైరల్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా అంటేనే వ్యక్తులు ఫేమస్‌గా మారడం కోసం ప్రతి ప్రయత్నాలను చేసే ఓ విస్తృత ప్లాట్‌ఫామ్‌గా మారింది. అయితే ప్రపంచంలో కొంతమంది అభిరుచులు ప్రత్యేకమైనవి. వారి అలవాట్లు, అభిరుచులు కూడా నెట్టింట షేర్‌ చేయటం ద్వారా అలాంటి వారు పబ్లిక్‌లో పాపులర్‌ అవుతుంటారు. పాపులారిటీ కోసం ప్రజలు ఎలాంటి పనులైన చేస్తుంటారు. ప్రస్తుతం ఒక మహిళ వింత హెయిర్‌స్టైల్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. సదరు లేడీ హెయిర్‌స్టైల్‌ను చూసి మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే..

ఈ వీడియోలో, ఒక మహిళ సెలూన్‌లో హాయిగా కూర్చుని ఉంది. అక్కడి హెయిర్ ఆర్టిస్టులు ఇద్దరు ఆమె జుట్టుకు జెల్లీ లాంటి క్రీమ్‌ని అప్లై చేయడం మొదలుపెట్టారు. అలా ఆమె తలవెంట్రుకలతో జుట్టును ఓ పాత్రలాగా మార్చేశారు. ఆ తరువాత అతను ఆ హెయిర్‌ బౌల్‌లో నీరు పోశాడు. అందులో కొన్ని చేపలను కూదా తీసుకొచ్చి వేశాడు. తలపై నీటిలో బంగారు రంగు చేపలను వదిలేశాడు.. దాంతో ఆ స్త్రీ హాయిగా నవ్వుకుంటుంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి వీడియోలతో చాలా మంది తరచుగా ఇలాంటి వింత పనులు చేస్తుంటారు. ఈ మహిళ కూడా అలాంటిదే చేసింది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, వారి ప్రతిచర్యను చూడటానికి, ఆమె ఇలా తన తలపై చేపలను పెంచుతుంది. ఈ వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఇలా ఎవరికీ సాధ్యం కాదని, ఇదంతా చూసినా కూడా నమ్మలేకపోతున్నారు.

ఈ వీడియో చూసిన జనాలు కామెంట్స్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. కొందరు కూల్‌గా, మరికొందరు మూర్ఖత్వం అంటున్నారు. ఈ స్త్రీ తన జుట్టును ఎలా కడగుతుందని మరొకరు ఆందోళనగా అడుగుతున్నారు.? ఈ వీడియో చూసి జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే, మరోపక్క చాలా రకాల ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..