తీరానికి అకస్మాత్తుగా వందలాది అరుదైన తాబేళ్లు…160 కిలోమీటర్ల మేర లాక్డౌన్!
ఒడిశా తీరంలో అరుదైన అలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల బ్రీడింగ్ కాలాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుండి మే 31 వరకు ఏడు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై పూర్తి నిషేధం విధించింది. మోటారైజ్డ్ బోట్లు, ఫిషింగ్ ట్రాన్సర్లు రాకుండా సముద్రంలో 24 గంటల నిఘా ఏర్పాటు చేశారు. తాబేళ్లు, వాటి గుడ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా 14 క్యాంపులను ఏర్పాటు చేసి, సాయుధ పోలీసులను మోహరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రకృతిలో అంతరించిపోతున్న అరుదైన జీవులను రక్షించడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా సముద్ర జీవుల పరిరక్షణలో భాగంగా, ఒడిశా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్లు ప్రతీ ఏటా ఒడిశా తీరానికి పెద్ద సంఖ్యలో సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. ఈ తాబేళ్ల సంతానోత్పత్తి కాలం అత్యంత సురక్షితంగా సాగేలా చూసేందుకు, ఒడిశా ప్రభుత్వం నవంబర్ 1 నుండి మే 31 వరకు ఏడు నెలల పాటు సముద్రంలో చేపల వేటపై కఠిన నిషేధం విధించింది.
160 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు
ఈ నిషేధం ధామ్రా నుండి దేవి నదీ ముఖద్వారం వరకు సుమారు 160 కిలోమీటర్ల తీర ప్రాంతంలో, సముద్రంలోకి 20 కిలోమీటర్ల దూరం వరకు వర్తిస్తుంది. ఇందులో ప్రపంచ ప్రసిద్ధ గహిర్మత మెరైన్ శాంక్చువరీ కూడా ఉంది. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో అలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ఇసుక తీరాలకు వస్తాయి.
ఎందుకు ఈ నిర్ణయం?
ఈ సమయంలో సముద్రంలో భారీ మోటార్ బోట్లు, ఫిషింగ్ ట్రాన్సర్లు తిరిగితే, వాటి శబ్దం రెక్కల తాకిడి వల్ల తాబేళ్లకు తీవ్ర ప్రాణాపాయం కలుగుతుంది. తాబేళ్లను, వాటి గుడ్లను వేటాడే అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికి ఈ ఆంక్షలు ఎంతో అవసరం. తాబేళ్ల రక్షణను పకడ్బందీగా అమలు చేయడానికి అటవీ శాఖ రంగంలోకి దిగింది. తీర ప్రాంతంలో మొత్తం 14 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాబుబాలి, శాసన్పేట వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సాయుధ పోలీసులను మోహరించారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాలర్లు, గస్తీ నౌకల ద్వారా రాత్రింబవళ్లు (24/7) సముద్రంలో నిఘా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాత స్పీడ్ బోట్లు మరమ్మతులకు గురైనప్పటికీ, కొత్త ట్రాలర్ల సహాయంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడు నెలల కఠిన ఆంక్షల ద్వారా ప్రతి ఏటా లక్షలాది అలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి చేరడానికి వీలవుతుంది.