Visakhapatnam: అతడే ఆమెలా నటించి.. ముగ్గులోకి దించి.. జానియర్ ఆర్టిస్టు ట్యాలెంట్‌కు ఖాకీలు షాక్!
సామాజిక మాధ్యమాల ద్వారా వలపు వల విసిరి బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజుకుంటున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాల్లో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌లా నకిలీ ఐడీలను సృష్టించి, అమాయకులకు గేలం వేయడం ఇతగాడి పంథా. యువతిలా వారితో మాట్లాడి, ముగ్గులోకి దింపి తర్వాత వివిధ అవసరాల పేరుతో డబ్బు కాజేస్తుంటాడు. పలువురు ఈ మాయగాడి వలలో చిక్కుకుని లక్షల డబ్బు పోగొట్టుకున్నారు..
విశాఖపట్నం, ఫిబ్రవరి 27: సామాజిక మాధ్యమాల ద్వారా వలపు వల విసిరి బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజుకుంటున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాల్లో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌లా నకిలీ ఐడీలను సృష్టించి, అమాయకులకు గేలం వేయడం ఇతగాడి పంథా. యువతిలా వారితో మాట్లాడి, ముగ్గులోకి దింపి తర్వాత వివిధ అవసరాల పేరుతో డబ్బు కాజేస్తుంటాడు. పలువురు ఈ మాయగాడి వలలో చిక్కుకుని లక్షల డబ్బు పోగొట్టుకున్నారు. మహానగర మాయగాడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి, ఆటకట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నానికి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ తమ్మారెడ్డి శశాంక్ రెడ్డి (24) సోషల్ మీడియాలో నకిలీ ఐడీలతో అకౌంట్లు తెరిచేవాడు. అలా నగరానికి చెందిన ఓ బాధితుడికి మేఘనా రఘుపాత్రుని పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. బాధితుడితో కేవలం చాటింగ్ మాత్రమే చేసేవాడు. మెసేజ్‌లతో భావోద్వేగాలకు గురిచేసేవాడు. బాధితుడు నేరుగా కలుద్దామని చెప్పడంతో గుట్టు బయటపడుతుందేమోనని జాగ్రత్తపడ్డాడు. మేఘన పేరుతోనే పరిచయం చేసుకుని తన సెల్‌ఫోన్ నంబరుకు పేటీఎం, ఫోన్‌పే ద్వారా డబ్బు పంపించమని కోరేవాడు. తల్లి మరణించిందని, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి అద్దె, ఈఎంఐలు పేరుతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలకుపైగా గుంజాడు.
తన డబ్బు తిరిగి ఇవ్వవల్సిందిగా బాధితుడు అడిగితే త్వరలోనే ఇస్తానని నమ్మబలికాడు. ఎంతకూ తనకు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సెల్‌ఫోన్ నంబరు, ఇతర సాంకేతికతల ఆధారంగా దర్యాప్తు చేసిన సైబర్ పోలీసులు.. శశాంక్‌రెడ్డే నకిలీ ఐడీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బాధితుడిని కూడా మేఘన పేరిట నకిలీ ఐడీతో మోసగించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. దీంతో నిందితుడు శశాంక్ రెడ్డిన అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.