UP Police Exam Cancelled: యూపీలో పేపర్‌ లీకేజీ కలకలం.. కానిస్టేబుల్‌ పరీక్ష రద్దు! 50 లక్షల యువత జీవితాలతో ఆటలు

పేపర్‌ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 24) రద్దు చేసింది. పేపర్‌ లీక్‌ ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను(ఎస్‌టీఎఫ్‌) ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షకు దాదాపు 48 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు పరీక్ష రద్దు చేస్టున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌..

UP Police Exam Cancelled: యూపీలో పేపర్‌ లీకేజీ కలకలం.. కానిస్టేబుల్‌ పరీక్ష రద్దు! 50 లక్షల యువత జీవితాలతో ఆటలు
UP Police Exam Cancelled
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2024 | 9:33 AM

లక్నో, ఫిబ్రవరి 25: పేపర్‌ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 24) రద్దు చేసింది. పేపర్‌ లీక్‌ ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను(ఎస్‌టీఎఫ్‌) ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షకు దాదాపు 48 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు పరీక్ష రద్దు చేస్టున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎక్స్‌ పోస్టు ద్వారా వెల్లడించారు. పరీక్షల పారదర్శకత విషయంలో రాజీ పడేది లేదు. యువత ఆశలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి వికృత చర్యలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెబుతాం. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు ఇప్పటి వరకూ 240 మందికి పైగా అరెస్టు చేశారని సీఎం యోగి పోస్టులో తెలిపారు.

కాగా దాదాపు 60,244 పోలీస్‌ కానిస్టేబుల్ పోస్టులకు గానూ ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఈ నియామక పరీక్ష నిర్వహించింది. ఒక పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. పేపర్‌ లీక్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ 2023ని రద్దు చేయాలని, వచ్చే ఆరు నెలల్లోపు పునఃపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో బీహార్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 6,00,000 మందికి పైగా ఉన్నారు. రీషెడ్యూల్ చేసిన పరీక్ష కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు.

అధికార భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరీక్ష రద్దు బ్రేకింగ్ న్యూస్ కావచ్చు. కానీ ఇది బీజేపీకి షాకింగ్ న్యూస్. ఈ ఘటనతో యూపీలోని ప్రతి నియోజకవర్గంలో బీజేపీ 2.5 లక్షల ఓట్లను కోల్పోయిందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. విద్యార్థి శక్తి, యువత ఐక్యతకు పెద్ద విజయం. ఉత్తరప్రదేశ్ పోలీసు పరీక్షను ఎట్టకేలకు రద్దు చేశారు. ప్రభుత్వం సత్యాన్ని అణిచివేసేందుకు ఎంత ప్రయత్నించినా, ఐక్యంగా పోరాడటం ద్వారా మాత్రమే మన హక్కులు సాధించుకోగలం అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.