AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hairstyle: హెయిర్‌ స్టైల్‌ వల్ల హైస్కూల్‌ విద్యార్ధి సస్పెండ్‌.. కోర్టు కెక్కిన పంచాయితీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే

హెయిర్‌ స్టైల్‌ కారణంగా హైస్కూల్‌ విద్యార్ధికి కోర్టు శిక్ష విధించింది. అందరు విద్యార్ధుల్లాకాకుండా విభిన్న హెయిర్ స్టైల్‌లో స్కూల్‌కి వచ్చిన నల్లజాతి విద్యార్ధిపై పాఠశాల యాజమన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాఠశాల తీరుపై సదరు విద్యార్ధి కోర్టును ఆశ్రయించాడు. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు పాఠశాల చర్యను సమర్ధించింది. పాఠశాల యాజమన్యం తీసుకున్న క్రమశిక్షణా చర్యను న్యాయమూర్తి సమర్థించారు..

Hairstyle: హెయిర్‌ స్టైల్‌ వల్ల హైస్కూల్‌ విద్యార్ధి సస్పెండ్‌.. కోర్టు కెక్కిన పంచాయితీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే
School Legally Punished Black Student Over Hairstyle
Srilakshmi C
|

Updated on: Feb 23, 2024 | 10:28 AM

Share

హ్యూస్టన్, ఫిబ్రవరి 23: హెయిర్‌ స్టైల్‌ కారణంగా హైస్కూల్‌ విద్యార్ధికి కోర్టు శిక్ష విధించింది. అందరు విద్యార్ధుల్లాకాకుండా విభిన్న హెయిర్ స్టైల్‌లో స్కూల్‌కి వచ్చిన నల్లజాతి విద్యార్ధిపై పాఠశాల యాజమన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాఠశాల తీరుపై సదరు విద్యార్ధి కోర్టును ఆశ్రయించాడు. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు పాఠశాల చర్యను సమర్ధించింది. పాఠశాల యాజమన్యం తీసుకున్న క్రమశిక్షణా చర్యను న్యాయమూర్తి సమర్థించారు. అసలేం జరింగిందంటే..

అమెరికాలోని హ్యూస్టన్‌ ఏరియా స్కూల్‌లో డారిల్ జార్జ్ (18) అనే నల్లజాతి యువకుడు చదువుతున్నాడు. అయితే అతడు లాక్స్ అనే తాళ్లతో హెయిర్‌ స్టైలింగ్‌ చేయించుకున్నాడు. పొడవాటి జుట్టును తలపై ముడిపెట్టి, వెనుకకు వదిలేశాడు. వెనుక షర్ట్‌ కాలర్‌ కిందకు, ముందు కనుబొమ్మల కిందకు పొడవాటి వెంట్రుకలు వేలాడుతూ కనిపించాయి. అదే హెయిర్‌ స్టైల్‌తో స్కూల్‌కి వెళ్లాడు. గమనించిన స్కూల్‌ యాజమన్యం యువకుడి హెయిర్ స్టైల్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తోందని అతనిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. దీంతో గత ఆగస్టు నుంచి అతన్ని రెగ్యులర్‌ క్లాస్‌లకు అనుమతించకుండా సస్పెండ్‌ చేశారు. హెయిర్‌ స్టైల్‌ కారణంగా నెలల తరబడి తనను శిక్షించడాన్ని తీవ్రంగా పరిగణించిన జార్జ్‌ తల్లిదండ్రులు తమ కుమారుడు నల్లజాతికి చెందిన వాడు కాబట్టి జుట్టు వివక్షను చూపుతున్నారంటూ కోర్టును ఆశ్రయించాడు.

జిల్లా న్యాయమూర్తి చాప్ కెయిన్ III ముందుకు గురువారం కేసు విచారణకు రాగా.. క్రౌన్ యాక్ట్ అనే చట్టం ద్వారా కేశాలంకరణకు రక్షణ ఉందని, పాఠశాల జుట్టు వివక్ష చూపుతుందని విద్యార్ధి తరపు న్యాయవాది పేర్కొన్నారు. విద్యార్ధి జార్జ్‌ స్కూల్‌ డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించాడని, పొడవైన జుట్టుతో పాఠశాలకు రావడం వల్లనే సస్పెన్సన్‌కు గురైనట్లు పాఠశాల తరపు న్యాయవాది సారా లియోన్‌ వాదించారు. పాఠశాల డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని సమర్ధిస్తూ ఉన్న అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. క్రౌన్ చట్టం ప్రకారం జాతి ఆధారిత జుట్టు వివక్ష నిషేధం. జుట్టు ఆకృతి, జడలు, లాక్‌లు, ట్విస్ట్‌లు సహా రక్షణాత్మక కేశాలంకరణ కారణంగా యజమానులు, పాఠశాల యాజమన్యాలు జరిమానా విధించకుండా నిషేధిస్తుంది. ఇదే విషయాన్ని జార్జ్‌ తరపు న్యాయవాది ప్రస్తావిస్తూ స్కూల్‌ యాజమన్యం క్రౌన్ చట్టం అమలు చేయడంలో విఫలమైనట్లు పేర్కాన్నారు. సుమారు 3 గంటలపాటు ఇరువురి వాదనలు విన్న కోర్టు పాఠశాల చర్యను సమర్ధించింది. పాఠశాల తీసుకున్న క్రమశిక్షణా చర్యలు వివక్షత లేనిదిగా పేర్కొంది. ఎందుకంటే పొడవాటి జుట్టు కోసం మినహాయింపులు, కేశాలంకరణకు రక్షణ ఇవ్వవచ్చని క్రౌన్‌ చట్టం చెప్పలేదు. చట్టాన్ని తిరగ రాయడానికి కోర్టులు ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. సమస్యను పరిష్కారానికి రాష్ట్ర శాసనసభ లేదా పాఠశాల బోర్డును సంప్రదించాలని న్యాయమూర్తి జార్జ్‌కు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.