AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Talibans: తాలిబన్ల అరాచకపాలనలో మరో దారుణం.. వేలాది మంది చూస్తుండగా స్టేడియంలో మరణ దండన

ఆఫ్గన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన కొనసాగుతోంది. తాజాగా ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను అందరూ చూస్తుండగా బహిరంగంగా శిక్షించారు. స్టేడియంలో తుపాకులతో కాల్చి హతమార్చారు. ఈ ఘటన తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఓ ఫుట్‌బాల్‌ స్టేడియంలో గురువారం (ఫిబ్రవరి 23) చోటుచేసుకొంది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ డార్వీష్ తెలిపిన వివరాల ప్రకారం..రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో..

Talibans: తాలిబన్ల అరాచకపాలనలో మరో దారుణం.. వేలాది మంది చూస్తుండగా స్టేడియంలో మరణ దండన
Talibans In Afghanistan
Srilakshmi C
|

Updated on: Feb 23, 2024 | 7:21 AM

Share

కాబూల్‌, ఫిబ్రవరి 23: అఫ్గాన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన కొనసాగుతోంది. తాజాగా ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను అందరూ చూస్తుండగా బహిరంగంగా శిక్షించారు. స్టేడియంలో తుపాకులతో కాల్చి హతమార్చారు. ఈ ఘటన తూర్పు అఫ్గానిస్థాన్‌లోని ఓ ఫుట్‌బాల్‌ స్టేడియంలో గురువారం (ఫిబ్రవరి 23) చోటుచేసుకొంది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ డార్వీష్ తెలిపిన వివరాల ప్రకారం..రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఈ ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అప్పటినుంచి విచారణ చేపట్టిన అక్కడి సుప్రీంకోర్టు తాజాగా వీరికి మరణశిక్ష విధించింది. బహిరంగంగా శిక్షను అమలుచేయాలంటూ ఆదేశించింది. దీంతో తాలిబాన్ అధికారులు గురువారం తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఘజ్నీ నగరంలో ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బహిరంగంగా కాల్చి చంపారు. తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సంతకం చేసిన డెత్ వారెంట్‌ను సుప్రీం కోర్టు అధికారి అతికుల్లా దర్విష్ బిగ్గరగా చదివి వినిపించాడు. ఆ తర్వాత వారిద్దరిపై తుపాకీ కాల్పులు జరిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. వీరి మరణ శిక్షను వీక్షించేందుకు ఫుట్‌బాల్‌ స్టేడియానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ శిక్షను చూసేందుకు హాజరైన వేలాదిమందిలో దోషుల కుటుంబాలు కూడా ఉన్నట్లు పేర్కొంది.

కాగా అఫ్గాన్‌లో తాలిబాన్ల పాలన 2021లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇస్లాం మత కఠినమైన నియమాలు అక్కడ విధించినప్పటికీ.. ఇప్పటి వరకూ ఏ ఇతర ప్రభుత్వమూ అక్కడ అధికారికంగా గుర్తించలేదు.’కిసాస్’ అని పిలిచే ‘కంటికి కన్ను’ శిక్షలతో సహా.. ఇస్లామిక్ చట్టం లేదా షరియాలోని అన్ని అంశాలను అమలు చేయాలని అఖుంద్జాదా 2022లో న్యాయమూర్తులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జీవన నియమావళిగా షరియాను అనుసరిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు, శిక్షలు, ఆర్థికం వంటి పలు అంశాలలో షరియాను మార్గదర్శిగా భావిస్తారు. స్థానిక ఆచారం, సంస్కృతి, మతపరమైన వివరణలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లు మాత్రం ప్రపంచంలో ఏ ముస్లిం కమ్యునిటీ అనుసరించని కఠిన శిక్షలను అమలు చేస్తోంది.

1996 నుండి 2001 వరకు సాగిన తాలిబాన్ల మొదటి పాలనలో బహిరంగంగా మరణశిక్షలు విధించేవారు. ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టిన తాలిబన్లు మళ్లీ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. గతంలోనూ దొంగతనం ఆరోపణలపై కాందహార్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో ప్రజలందరి ముందు తాలిబన్లు నలుగురు వ్యక్తుల చేతులను నరికేశారు. జూన్ 2023లో ఓ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని లాగ్‌మాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు మైదానంలో దాదాపు 2 వేల మంది చూస్తుండగా కాల్చి చంపారు. సరైన న్యాయవిచారణ జరపకుండా ప్రజలకు శిక్షలు విధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని గతంలో అఫ్గాన్‌ ప్రభుత్వంలో విధాన సలహాదారుగా పనిచేసిన షబ్నమ్‌ నాసిమి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.