కోతుల కోసం మినీ సిటీ !! మండిపడుతున్న అమెరికన్స్

కోతుల కోసం మినీ సిటీ !! మండిపడుతున్న అమెరికన్స్

Phani CH

|

Updated on: Feb 22, 2024 | 9:26 PM

అమెరికాలోని జార్జియా స్టేట్‌, బెయిన్‌బ్రిడ్జ్‌ పట్టణవాసులు సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ కంపెనీ కోతుల కోసం ఓ ప్రత్యేక సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకటనపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

అమెరికాలోని జార్జియా స్టేట్‌, బెయిన్‌బ్రిడ్జ్‌ పట్టణవాసులు సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ కంపెనీ కోతుల కోసం ఓ ప్రత్యేక సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకటనపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్రజలతోపాటు జంతు హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి. కోతుల పెంపకం వల్ల అక్కడ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ హామీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాదాపు 14,000 జనాభాగల ఈ పట్టణంలో, 30,000 కోతులు ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..

అమృత్‌ భారత్‌కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు

విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు

పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో