రంధ్రంతో గంటసేపు గాల్లోనే విమానం చక్కర్లు
సెర్బియాలోని బెల్‌గ్రేడ్ విమానాశ్రయంలో విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతున్న క్రమంలో రన్‌వే సమీపంలో ఉన్న లైట్లను ఢీకొంది విమానం. ఘటనలో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే గాల్లోకి దూసుకెళ్లిన విమానం.. గంట తర్వాత అదే విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఎయిర్ సెర్బియాకు చెందిన విమానం.. 106 మంది ప్రయాణికులతో బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది.
సెర్బియాలోని బెల్‌గ్రేడ్ విమానాశ్రయంలో విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతున్న క్రమంలో రన్‌వే సమీపంలో ఉన్న లైట్లను ఢీకొంది విమానం. ఘటనలో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే గాల్లోకి దూసుకెళ్లిన విమానం.. గంట తర్వాత అదే విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఎయిర్ సెర్బియాకు చెందిన విమానం.. 106 మంది ప్రయాణికులతో బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది. సాధారణంగా రన్‌వే పై 7 వేల అడుగులు ప్రయాణించి ఆ తర్వాతే టేకాఫ్‌కు యత్నిస్తుంటారు పైలట్లు. కానీ కేవలం 4 వేల అడుగుల్లో టేకాఫ్‌కు ప్రయత్నించి ఈ ఘటనలో తగినంత ఎత్తుకు చేరుకోకపోవడంతో రన్‌వే చివర్లో ఉన్న లైట్లను విమానం ఢీకొంది. ఎడమవైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమైంది. రంధ్రం పడటంతో పాటు విమానం బాడీ చీరుకుపోయినట్లు కనిపిస్తోన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తోక భాగం కూడా దెబ్బతింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్యన్ పైలెట్‌ను స్పెయిన్‌లో ఎందుకు చంపారు ??
అయోధ్య రాముణ్ణి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. గుంటూరు వైద్యుల ఘనత
Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??
TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్ కేసులో బయటపడ్డ సంచలన నిజం