పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
కాలంతో పాటు భారతీయ సంస్కృతి, విలువల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వైవాహిక బంధంలో భార్యాభర్తలది సమస్థాయి అన్న భావన వేళ్లూనుకుంది. ఈ విశ్వాసాన్ని యువత రకరకాలుగా వ్యక్తీకరిస్తోంది. గువాహటిలో ఇటీవల జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెళ్లిలో వరుడు ఊహించని విధంగా వధువుకు పాదనమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వరుడిపై ప్రశంసలతో పాటు విమర్శలూ వెల్లువెత్తాయి.
కాలంతో పాటు భారతీయ సంస్కృతి, విలువల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వైవాహిక బంధంలో భార్యాభర్తలది సమస్థాయి అన్న భావన వేళ్లూనుకుంది. ఈ విశ్వాసాన్ని యువత రకరకాలుగా వ్యక్తీకరిస్తోంది. గువాహటిలో ఇటీవల జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెళ్లిలో వరుడు ఊహించని విధంగా వధువుకు పాదనమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో వరుడిపై ప్రశంసలతో పాటు విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. గౌహతీలో ఇటీవల ఓ వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంధ్రంతో గంటసేపు గాల్లోనే విమానం చక్కర్లు
రష్యన్ పైలెట్‌ను స్పెయిన్‌లో ఎందుకు చంపారు ??
అయోధ్య రాముణ్ణి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్.. గుంటూరు వైద్యుల ఘనత
Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??
TOP 9 ET News: మహేష్‌కు.. జక్కన్న షాకింగ్ కండీషన్ | షణ్ముక్ కేసులో బయటపడ్డ సంచలన నిజం