స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు

స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు

Phani CH

|

Updated on: Feb 22, 2024 | 9:19 PM

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఉందంటే నమ్ముతారా? స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి మువ్వన్నెల పతాకం ఎగిరింది. దీంతో ఆ గ్రామస్థులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఉందంటే నమ్ముతారా? స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి మువ్వన్నెల పతాకం ఎగిరింది. దీంతో ఆ గ్రామస్థులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు. పువర్తి.. మావోయిస్ట్‌ అగ్రనేత హిడ్మా స్వగ్రామం కావడంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు భయపడేవారు. ఇక హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా.. వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దానిని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు.. గ్రామంలో జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేశారు. అలా.. సోమవారం జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించారు. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ జాతీయ జెండా రెపరెపలాడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై వధువు కాళ్లపై పడిన వరుడు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

రంధ్రంతో గంటసేపు గాల్లోనే విమానం చక్కర్లు

రష్యన్ పైలెట్‌ను స్పెయిన్‌లో ఎందుకు చంపారు ??

అయోధ్య రాముణ్ణి చూపిస్తూ మెదడుకు ఆపరేషన్‌.. గుంటూరు వైద్యుల ఘనత

Vladimir Putin: కిమ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపిన పుతిన్.. అదేంటంటే ??