SCCL Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల 

సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం రాత్రి (ఫిబ్రవరి 22) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్‌ వివరాలను వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ పోస్టులు 10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) పోస్టులు 2, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 18..

SCCL Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల 
SCCL Notification 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 23, 2024 | 6:43 AM

సింగరేణి, ఫిబ్రవరి 23: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం రాత్రి (ఫిబ్రవరి 22) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్‌ వివరాలను వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ పోస్టులు 10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) పోస్టులు 2, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) పోస్టులు 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) పోస్టులు 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 16 భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.

మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు మార్చి 18వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మిగిలిన అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగాలు నిర్వహిస్తోన్న వారికి మాత్రం వయోపరిమితిలో ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మార్చి 1వ తేదీన విడుదల చేసే నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలని, ఇతర పూర్తి వివరాలకు సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌ లోని ‘కెరీర్‌’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం అభ్యర్ధులకు సూచించింది

కాగా బుధవారం నాడు సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై సంస్థ సీఎండీతో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యేడాది సింగరేణిలో వెయ్యి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని సూచించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల నేపథ్యంలో సింగరేణిలో నియామకాలపై సీఎండీ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాపై యూబీఐతో ఒప్పందం సైతం చేసుకుంటామని సీఎండీ బలరామ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?