AP High Court: టెట్, ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్షల తేదీలపై నేడు హైకోర్టు కీలక నిర్ణయం.. కొత్త షెడ్యూల్ వచ్చేనా?
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పరీక్షల సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వకుండానే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై..
అమరావతి, ఫిబ్రవరి 23: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పరీక్షల సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వకుండానే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ఫిబ్రవరి 23న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టెట్ నిర్వహణ కోసం ఫిబ్రవరి 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 12న ఇచ్చిన నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు అనే వ్యక్తితోపాటు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు సిద్ధపడేందుకు తగిన సమయం లేని కారణంగా పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని వీరు కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు ఈ రోజు స్పందించనుంది.
తెలంగాణ మోడల్ పాఠశాలల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణలోని మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష-2024కు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచుతున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో సూచించింది.
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2024 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పరిశోధనా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2024 నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలు, రిసెర్చ్ సెంటర్స్, అనుబంధ కళాశాలల్లో పీహెచ్‌డీ (ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఏపీ ఆర్‌సెట్ 2024ను నిర్వహిస్తోంది. పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మార్చి 19లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. రూ.2000 ఆలస్య రుసుముతో మార్చి 20 నుంచి మార్చి 29 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 4 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు అవకాశం కల్పించింది. ప్రవేశ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఏప్రిల్‌లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితర విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.