Sudarshan Setu Bridge: దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అమేజింగ్ వీడియో..

ప్రధాని మోడీ మొదట ఫిబ్రవరి 25 ఉదయం శ్రీ బేట్ ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి పూజిస్తారు. ఆ తర్వాత ఆయన సుదర్శన్ సేతును సందర్శిస్తారు. ఈ వంతెనను సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత, ప్రజలు బెట్ ద్వారకాధీష్ ఆలయానికి వెళ్లడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు బెట్ ద్వారకాధీష్ ఆలయానికి వెళ్లడానికి పడవ సహాయం తీసుకోవలసి ఉంటుంది. ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందు పీఎం తన సోషల్ మీడియా..

Sudarshan Setu Bridge: దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అమేజింగ్ వీడియో..
Sudarshan Setu Bridge
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2024 | 8:59 AM

తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి రూ. 52 వేల కోట్లకు పైగా కొత్త ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ వంతెనను గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో నిర్మించారు.

జామ్‌నగర్, ద్వారక, పోర్ బందర్ జిల్లాల్లో రూ.4 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో చేర్చబడిన సుదర్శన్ సేతును కూడా పీఎం మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన ప్రధానమంత్రి కలల ప్రాజెక్ట్. ఇది ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సుదర్శన్ సేతు 2.32 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటివరకు భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్టెడ్ వంతెన. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ.980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది.

ఇవి కూడా చదవండి

సుదర్శన్ వంతెన ప్రత్యేకత ఏమిటి?

ఈ వంతెన భారతదేశపు అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్. దీని ఫుట్‌పాత్ పై భాగంలో సౌర ఫలకాలను అమర్చారు. ఈ సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వంతెనకు 2017 అక్టోబర్‌లో ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నాలుగు లేన్లు, రెండు వైపులా 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ఈ వంతెన చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సందర్శించే పర్యాటకులందరికీ కేంద్రంగా ఉంటుంది. వంతెనపై అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తాయి. సుదర్శన్ వంతెన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. దాని కాలిబాటను భగవద్గీతలోని శ్లోకాలు, శ్రీ కృష్ణుడి చిత్రాలతో అలంకరించారు.

సిగ్నేచర్ బ్రిడ్జ్ 

నివేదిక ప్రకారం..పీఎం మొదట ఫిబ్రవరి 25 ఉదయం శ్రీ బేట్ ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించి పూజిస్తారు. ఆ తర్వాత ఆయన సుదర్శన్ సేతును సందర్శిస్తారు. ఈ వంతెనను సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత, ప్రజలు బెట్ ద్వారకాధీష్ ఆలయానికి వెళ్లడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు బెట్ ద్వారకాధీష్ ఆలయానికి వెళ్లడానికి పడవ సహాయం తీసుకోవలసి ఉంటుంది. ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందు పీఎం తన సోషల్ మీడియా ఖాతా X లో పోస్ట్ చేసారు. అందులో గుజరాత్ అభివృద్ధి పథానికి రేపు ప్రత్యేక రోజు అని రాశారు. ప్రారంభించబడుతున్న అనేక ప్రాజెక్టులలో ఓఖా ప్రధాన భూభాగాన్ని, బెట్ ద్వారకను కలిపే సుదర్శన్ వంతెన కూడా ఉంది. ఇది కనెక్టివిటీని పెంచే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?