BJP: మిషన్ సౌత్ వర్కౌట్ ఆయ్యేనా.. కమలదళం వ్యూహమేంటి..

ప్రస్తుతం బీజేపీ నినాదం వై నాట్ 370. ఈ సార్వత్రిక ఎన్నిక‌ల్లో గ‌తంలో సాధించిన 303 సీట్ల కంటే అధిక స్థానాలు గెల‌వాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు క‌మ‌ల‌నాధులు. ఇన్ని సీట్లు గెలవాలంటే.. ఒక్క నార్త్‎లోనే కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసించాలి. కానీ.. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి.. దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు.

BJP: మిషన్ సౌత్ వర్కౌట్ ఆయ్యేనా.. కమలదళం వ్యూహమేంటి..
Mission South Bjp
Follow us
Srikar T

|

Updated on: Feb 24, 2024 | 10:30 PM

ప్రస్తుతం బీజేపీ నినాదం వై నాట్ 370. ఈ సార్వత్రిక ఎన్నిక‌ల్లో గ‌తంలో సాధించిన 303 సీట్ల కంటే అధిక స్థానాలు గెల‌వాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు క‌మ‌ల‌నాధులు. ఇన్ని సీట్లు గెలవాలంటే.. ఒక్క నార్త్‎లోనే కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలం వికసించాలి. కానీ.. ఉత్తరాది మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి.. దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో.. బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు కమలం నేతలు. కానీ.. ఉత్తరాదిలో వర్కవుట్‌ అయినట్లుగా.. దక్షిణాదిలో మాత్రంలో ఫలించడం లేదు. అందుకే.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో.. దక్షిణాదిలో పట్టు బిగించేందుకు.. పక్కా ప్రణాళికతో మిషన్‌ సౌత్‌ను రెడీ చేశారు.. అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారాన్ని హోరెత్తించాలని భావిస్తోంది.

పార్టీకి పట్టు లేకున్నా సౌత్‌లో వ్యక్తిగతంగా విశేష ప్రజాదరణ కల్గిన ప్రధాని మోదీతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారం తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా పర్యటించే అవకాశం ఉంది. వాటిలో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే అధికారిక పర్యటనలు కాగా, మరికొన్ని పూర్తిగా పార్టీ ఏర్పాటు చేసే ప్రచార సభలేనని తెలుస్తోంది. ఫిబ్రవరి 27న కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ప్రధాని మోదీ తన పర్యటన ప్రారంభించనున్నారు. అందులో భాగంగా.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను మోదీ సందర్శించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అక్కడే ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కణ్ణుంచి తమిళనాడుకు వెళ్లి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామళై చేపట్టిన యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. మధురైలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటల్ మొబిలిటీ ఈవెంట్‌లో కూడా పాల్గొంటారు.

ఫిబ్రవరి 28న తూత్తుకూడిలో కొన్ని శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు ప్రధాని మోదీ. తూత్తుకూడి.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి కనిమొళి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అలానే.. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటివారంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సందర్శించి అక్కడ కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటు.. పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..