AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మహిళా సాధికారతే ముఖ్యం.. మా ప్రభుత్వం ప్రాధాన్యత అదే.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం కాశీలోని మహిళలతో తాను సంభాషించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించి సుమారు రూ. 13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

PM Modi: మహిళా సాధికారతే ముఖ్యం.. మా ప్రభుత్వం ప్రాధాన్యత అదే.. ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2024 | 10:56 AM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం కాశీలోని మహిళలతో తాను సంభాషించిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించి సుమారు రూ. 13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అదే సమయంలో, ప్రధాన మంత్రి UPSIDA ఆగ్రో పార్క్ కార్ఖియాన్వ్‌లో బనాస్ కాశీ సంకుల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. కాగా, గిర్ ఆవులను అందజేసిన మహిళా లబ్ధిదారులతో ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంభాషించారు. ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన వీడియోలో చాలా మంది మహిళలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అతను సోషల్ మీడియా సైట్ ‘X’ లో ఇలా రాశారు.. ‘మహిళా శక్తి సాధికారతే మా ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత. గిర్ ఆవు లభించిన తర్వాత తమ జీవితాల్లో చాలా మార్పు వచ్చిందని బాబా విశ్వనాథ్ నగరంలోని తల్లులు, సోదరీమణుల నుండి తెలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించింది.’’ అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో సంభాషణ సందర్భంగా పలువురు మహిళలు గిర్ ఆవుల గురించి, వాటి పెంపకం, లాభాల గురించి వివరించారు.

ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియో చూడండి..

గిర్ ఆవులను మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం..

బనాస్ డెయిరీని సందర్శించిన ప్రధాన మంత్రి, అక్కడ పశువుల పెంపకం మహిళలతో సంభాషించారు. రెండేళ్ల క్రితం బనాస్ డెయిరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వారణాసి పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేను బనాస్ డెయిరీ ప్లాంట్‌కి వెళ్లానని చెప్పారు. అక్కడ చాలా మంది పశువుల పెంపకంలో ఉన్న సోదరీమణులతో మాట్లాడే అవకాశం వచ్చింది. మేము 2-3 సంవత్సరాల క్రితం ఈ రైతు కుటుంబాల సోదరీమణులకు దేశవాళీ జాతి గిర్ ఆవులను ఇచ్చాము. పూర్వాంచల్‌లో మెరుగైన జాతి దేశీయ ఆవుల గురించి సమాచారాన్ని అందించారు. ఆవులను పెంచడం, రైతులు, పశువుల పెంపకందారులు దాని నుంచి ప్రయోజనం పొందాలన్నదే తమ లక్ష్యం అంటూ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!