AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. దేశంలోనే అతి పొడవైన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. 

PM Modi Gujarat visit : గుజరాత్‌లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు రూ. 980 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 2.32 కి.మీ.ల దూరంలో దీనిని నిర్మించారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఇదే.. సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్‌పాత్, రెండు వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలను కలిగి ఉంది.

PM Modi: ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. దేశంలోనే అతి పొడవైన ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. 
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2024 | 12:37 PM

Share

PM Modi Gujarat visit : గుజరాత్‌లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు రూ. 980 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 2.32 కి.మీ.ల దూరంలో దీనిని నిర్మించారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఇదే.. సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్‌పాత్, రెండు వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలను కలిగి ఉంది. ఇది ఫుట్‌పాత్ ఎగువ భాగాలలో సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. ఇది ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వంతెన రవాణా సౌకర్యాన్ని సులభతరం చేస్తుంది.. ద్వారక – బేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వంతెన నిర్మాణానికి ముందు, యాత్రికులు బేట్ ద్వారక చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడవలసి వచ్చేది.. ఈ వంతెన నిర్మాణానికి ముందు, యాత్రికులు బేట్ ద్వారక చేరుకోవడానికి పడవ రవాణాపై ఆధారపడవలసి వచ్చేది.. ఇప్పుడు ఆ అవసరం లేకుండా.. భక్తులు సౌకర్యవంతంగా తీగల వంతెన ద్వారా చేరుకోవచ్చు.. అంతేకాకుండా ఈ ఐకానిక్ వంతెన దేవభూమి ద్వారకలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచిపోనుంది.

వీడియో చూడండి..

ఎంతో ప్రత్యేకం ఈ ఐకానిక్ వంతెన..

  • దాదాపు రూ.980 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.
  • ఇది దేశంలోనే అతి పొడవైన 2.32 కేబుల్ వంతెన సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది, శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్‌పాత్..
  • రెండు వైపులా భగవాన్ కృష్ణుడి చిత్రాలను కలిగి ఉంది.
  • ఇది ఫుట్‌పాత్ ఎగువ భాగాలలో సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసి, ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రధాని మోదీ.. ఇవాళ, రేపు గుజరాత్‌లో పర్యటిస్తారు. దాదాపు 52,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల‌కు ప్రధాని మోదీ శంకుస్థాప‌న, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు, బేట్ ద్వారక ఆలయాన్ని దర్శించుకుంటారు. దీని తరువాత ఉదయం 8:25 గంటలకు సుదర్శన్ సేతును సందర్శిస్తారు. ఆ తర్వాత ఉదయం 9:30 గంటలకు ఆయన ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ద్వారకలో 4150 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధాని రాజ్‌కోట్ ఎయిమ్స్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా రాజ్‌కోట్ ఎయిమ్స్ తోపాటు.. బటిండా, రాయ్‌బరేలి, కళ్యాణి, మంగళగిరిలలో నిర్మించిన ఐదు ఎయిమ్స్‌లను జాతికి అంకితం చేస్తారు. అనంతరం ద్వారకలో జరిగే బహిరంగ సభలో సుదర్శన్ సేతును ప్రారంభిస్తారు.

200 కంటే ఎక్కువ హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ESIC 21 ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేస్తారు. ఈ పర్యటనలో న్యూ ముంద్రా-పానిపట్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో ఆరోగ్యం, రోడ్డు, రైలు, ఇంధనం, పెట్రోలియం & సహజ వాయువు, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాల సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..