AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. ఘోర ప్రమాదం.. నదీ స్నానానికి వెళ్లి వస్తూ.. 15 మంది భక్తుల మృతి

పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. ట్రాలీలో ప్రయాణీస్తున్న వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలున్నారు.

అయ్యో దేవుడా.. ఘోర ప్రమాదం.. నదీ స్నానానికి వెళ్లి వస్తూ.. 15 మంది భక్తుల మృతి
Kasganj Accident
Surya Kala
|

Updated on: Feb 24, 2024 | 1:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. పాటియాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్యాగంజ్‌లోని చెరువులో భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 మంది చిన్నారులు సహా 15 మంది మరణించారు. ట్రాక్టర్ ట్రాలీలో 30 మందికి పైగా భక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ భక్తులందరూ మాఘ పొర్ణమి సందర్భంగా కదర్‌గంజ్ ఘాట్‌లో గంగాస్నానం చేసి తిరిగి వస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీ ఒక్కసారిగా బోల్తా పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం డీఎం, ఎస్పీ సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు.

పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. ట్రాలీలో ప్రయాణీస్తున్న వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలున్నారు.

ఇవి కూడా చదవండి

మృతుల్లో 8 మంది మహిళలు, 7 మంది చిన్నారులు

మృతుల్లో 8 మంది మహిళలు, 7 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను తొలుత జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొంత మంది భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు రోదనలతో  మిన్నంటాయి.

సీఎం యోగి సంతాపం

కస్గంజ్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కస్గంజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకరమని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని చెప్పారు. క్షతగాత్రులందరికీ ఉచిత వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించారు.  మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని సీఎం యోగి చెప్పారు.

మృతులు, క్షతగాత్రుల బంధువులకు పరిహారం ప్రకటన

ట్రాక్టర్ ట్రాలీలో 30 మంది ప్రయాణిస్తున్నట్లు కస్గంజ్ డీఎం సుధా వర్మ తెలిపారు. 15 మంది చనిపోయారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది చెరువులో చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..