Yana Mir: నేను మలాలాను కాను.. దేశం విడిచిపెట్టి పారిపోవడానికి.. నా దేశంలో రక్షణ, స్వేచ్ఛ ఉందన్న కశ్మీర్ యువతి

యానా మీర్ భారతదేశంలోని కాశ్మీర్ నివాసి. కాశ్మీర్‌లో పుట్టిన పెరిగిన యానా సామాజిక కార్యకర్త.  ఆ వైరల్ ప్రసంగంలో యానా మాట్లాడుతూ.. 'నేను మలాలా యూసఫ్‌జాయ్ కాదు. ఎందుకంటే నా దేశం భారతదేశంలో నేను స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. భారతదేశంలో భాగమైన నా స్వస్థలమైన కాశ్మీర్‌లో నేను స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. నేను ఎన్నటికీ నా దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశంలో ఆశ్రయం పొందవలసిన అవసరం లేదు. నేను ఎప్పటికీ మలాలా యూసఫ్‌జాయ్‌ను కానని చెప్పారు. 

Yana Mir: నేను మలాలాను కాను.. దేశం విడిచిపెట్టి  పారిపోవడానికి.. నా దేశంలో రక్షణ, స్వేచ్ఛ ఉందన్న కశ్మీర్ యువతి
Kashmiri Activist Yana MirImage Credit source: Twitter
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2024 | 12:17 PM

అంతర్జాతీయ వేదికగా భారత్, కశ్మీర్ గురించి కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని కాశ్మీరీ యువతి తిప్పి కొట్టారు. అంతర్జాతీయ వేదికల మీద భారత్ గౌరవాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని కశ్మీరి సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పాకిస్థాన్ చెందిన మలాలా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తనదైన శైలిలో స్పందించారు. నేను మలాలాని కాను.. ఎప్పటికి ఆమెలా నేను బతకను.. ఎందుకంటే నేను నా దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశం పారిపోయి బతకాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే తాను భారత్‌లో భాగమైన కశ్మీర్‌లో సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నానని స్పష్టం చేశారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో యానా మీర్ పాల్గొన్నారు. ఈ వేదికలో భారత్ ను జమ్మూ కశ్మీర్ ప్రజలను విభజించే ప్రక్రియను ఆపేయాలంటూ తన గళాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి వినిపించారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాను కోరారు. యానామీర్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యానా ప్రసంగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యానా మీర్ భారతదేశంలోని కాశ్మీర్ నివాసి. కాశ్మీర్‌లో పుట్టిన పెరిగిన యానా సామాజిక కార్యకర్త.  ఆ వైరల్ ప్రసంగంలో యానా మాట్లాడుతూ.. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్ కాదు. ఎందుకంటే నా దేశం భారతదేశంలో నేను స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. భారతదేశంలో భాగమైన నా స్వస్థలమైన కాశ్మీర్‌లో నేను స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. నేను ఎన్నటికీ నా దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశంలో ఆశ్రయం పొందవలసిన అవసరం లేదు. నేను ఎప్పటికీ మలాలా యూసఫ్‌జాయ్‌ను కానని చెప్పారు.

అయితే  పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్నారు. మహిళల విద్యపై తాలిబాన్ నిషేధానికి వ్యతిరేకంగా మలాలా మాట్లాడారు. దీంతో 2012లో పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో మలాలాపై తాలిబన్లు దాడి చేశారు. మలాలాపై కాల్పులు జరిపారు. ఆ దాడి తర్వాత మలాలా బ్రిటన్‌కు వెళ్లి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ ఆమె 2014లో నోబెల్ శాంతి బహుమతిని పొందిన అతి పిన్న వయస్కురాలగా నిలిచారు. అయితే దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో నివసిస్తున్న మలాలా భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై భారతనారి.. కాశ్మీరీకి చెందిన యువతి యానా మీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

యానా ప్రసంగంలో.. నాకు అభ్యంతరం ఉంది.. ఎందుకంటే మలాలా యూసఫ్‌జాయ్ నా దేశాన్ని అవమానిస్తున్నారు. ప్రగతిశీలలో పరిగెడుతున్న నా మాతృభూమిని ‘అణచివేత’ అని పిలుస్తున్నారు మలాలా. అసలు భారతలోని కశ్మీర్ ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు.. అయినప్పటికీ కాశ్మీర్ ‘అణచివేత’ కు సంబంధించిన కథనాలను కొన్ని రకాలు గా సృష్టిస్తున్న సోషల్ మీడియా, విదేశీ మీడియాలో మలాలా వంటి ‘టూల్‌కిట్ సభ్యుల’ అందరినీ తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా కశ్మీర్‌ను సందర్శించేందుకు ఎన్నడూ ఇష్టపడని అంతర్జాతీయ మీడియా.. తమ దగ్గర ఎదో అణచివేత జరిగిందని వచ్చే కథనాలను వ్యతిరేకిస్తున్నాను అని యానా మీర్ అన్నారు..

యానా మీర్ కాశ్మీర్ లోయ నుండి ఉద్భవించిన మొదటి భారతీయ మహిళా వ్లాగర్. బ్రిటీష్ పార్లమెంట్ భవనంలో ఆవేశపూరిత ప్రసంగంలో భారతీయులను మతం ప్రాతిపదికన ధ్రువీకరించే ప్రయత్నాలను ఆపాలని యానా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ప్రసంగం చివరలో, “మనలోని (ఐక్యతను) విచ్ఛిన్నం చేసి  దేనినీ అనుమతించము.. బ్రిటన్ , పాకిస్తాన్‌లో నివసిస్తున్న కొంతమంది నా దేశాన్ని అవమానించడం మానేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..