బాబోయ్‌.. ప్లాస్టిక్ భూతం పగబడుతోంది..! కడుపులో పిండాన్నీ వదలక వెంటాడుతోంది.. శాస్త్రవేత్తల ఆందోళన

వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ పరిమాణం పెరుగుతుండడం, ఆరోగ్యంపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్‌ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదకర మైక్రోప్లాస్టిక్‌..

బాబోయ్‌..  ప్లాస్టిక్ భూతం పగబడుతోంది..! కడుపులో పిండాన్నీ వదలక వెంటాడుతోంది.. శాస్త్రవేత్తల ఆందోళన
Microplastics In Pregnant
Follow us

|

Updated on: Feb 24, 2024 | 11:00 AM

సామాన్యుడు తన దైనందిన జీవితంలో ప్లాస్టిక్‌పై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాడు. ఉదయం నిద్రలేచి నీళ్లు తాగింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలో ప్లాస్టిక్‌ వాడకం తప్పనిసరి అయిపోయింది. వాటర్ బాటిల్స్, టీ కప్పులు, టీ బ్యాగులు, వాషింగ్ పౌడర్, కాస్మెటిక్ ఉత్పత్తులు మొదలైన వాటిలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. మానవ శరీరానికి ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ వీటిలో ఉంటుంది. దీనిపై పరిశోధన చేసేందుకు ఓ టూల్ వచ్చింది. న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీలోని శాస్త్రవేత్తలు ఈ మైక్రోప్లాస్టిక్‌లు మానవుని మావిలో ఎన్ని ఉన్నాయో పరీక్షించడానికి ఈ కొత్త సాధనాన్ని ఉపయోగించారు. టాక్సిలాజికల్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. సైంటిస్టులు 62 మంది గర్భిణుల శాంపిళ్లను పరిశీలిస్తే ప్రతి గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మైక్రో ప్లాస్టిక్‌ కనిపించింది.

వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ పరిమాణం పెరుగుతుండడం, ఆరోగ్యంపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో మైక్రోప్లాసిక్‌ రేణువులు పెరుగుతున్నాయంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదకర మైక్రోప్లాస్టిక్‌ ప్లాసెంటాపై ప్రభావం చూపితే, అది భూమిపై ఉన్న అన్ని క్షీరదాలపై ప్రభావం చూపుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మాథ్యూ కాంపెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వాతావరణంలో కనిపించే మైక్రోప్లాస్టిక్‌లు దాదాపు 40 నుంచి 50 ఏళ్ల నాటివి కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మన శరీరంలోని మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రతలు పెరగడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, పెద్దప్రేగు క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉండవచ్చని మాథ్యూ కాంపెన్‌ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. మనం దానిని ఆపకపోతే పర్యావరణంలో మరింత ప్లాస్టిక్‌ ప్రమాదం మరింతపెరిగిపోతుందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..