- Telugu News Photo Gallery Health tips drinking hot water is good but if you drink too much is dangerous because Telugu Health Tip
Health Tips: వేడి నీటిని అతిగా తాగుతున్నారా.. జాగ్రత్త! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..?
కరోనా తర్వాత చాలా మంది హెల్త్ కేర్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారంతో ఇమ్యూనిటి పెంచుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. అలాగే, చాలామందికి వేడి నీరు తాగేందుకు బాగా అలవాటుపడిపోయారు. అలాగే, కొందరికి ప్రతిరోజూ ఉదయం పూట ఒక గ్లాస్ వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇలా మితంగా వేడి నీరు తాగడం మంచిదే. కానీ, ప్రతిరోజూ ఎక్కువగా వేడినీరు తాగితే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 24, 2024 | 9:36 AM

సాధారణంగా ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగటం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలాగే కొందరు వామ్‌వాటర్‌లో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయిన భావిస్తారు. వేడి నీరు తాగటం వల్ల బరువు తగ్గుతారని, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చునని భావిస్తారు.. అంతేకాకుండా వేడి నీటి అలవాటుతో మలబద్దకం సమస్య కూడా దూరమవుతుంది.

అయితే, వేడినీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంట. ప్రతిరోజు అన్నీ సమయాల్లో వేడి నీరు తాగితే శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా వేడి నీరు తాగడం వల్ల మెదడు కణాల వాపుకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తుందని చెప్తున్నారు.

సాధారణంగా నీటిని రోజుకు 4 లేదా 5 లీటర్లు తగాల్సివుంటుంది. ఇలా తాగడం వల్ల శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా జరుగుతుంది. కానీ సాధారణ నీటికి బదులుగా వేడినీటిని తరచూ తాగితే శరీరానికి అవసరమైన మోతాదులో నీరు త్రాగలేము. తద్వారా అదనపు సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Hot Water

వేడినీరు తరచూ తాగడం వల్ల పెదాలు, గొంతు పొడిబారుతుంది. అంతే కాకుండా దంతాలకు తరచూ వేడినీరు తాకితే ఏనామిల్ పొర దెబ్బతిని పంటినొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అధికంగా వేడి నీరు తాగకుండా కేవలం అనారోగ్యం బారిన పడినప్పుడు గోరు వెచ్చని నీరు త్రాగడం.. మిగిలిన సమయాల్లో కాచి చల్లార్చిన నీరు త్రాగడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.




